స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వజగత్తు నీ జ్ఞాపికయే
విశ్వాధామాని విశ్వచక్ష ఋభ్వసః ప్రభోస్తే సతః పరి యంతి కేతవః
వ్యానశిః పవసే సోమ ధర్మభిః పతిర్విశ్వస్య భువనస్య రాజసి॥ ఋ.9-86-5.
ప్రతిపదార్థం:- విశ్వచక్షః = సమస్తాన్ని ఒకేసారి దర్శించగల ఓ ప్రభూ! విశ్వా= సర్వ; ధామాని= లోకాలను; ఋభ్వసః= ప్రకాశింపచేసే వానిని ప్రకాశింపచేస్తూ; సతః= ఉండిన; తే= నీ; ప్రభోః= వైభవాలకు; కేతవః= చిహ్నాలు; పరియంతి= అన్నివైపులనుండి కనబడుతూ ఉన్నాయి; సోమ= శాంతిప్రదాయకుడవైన ఓ దేవా! త్వం= నీవు(అధ్యాహార్యం) వ్యానశిః= నిరంతరం విశేషంగా వ్యాపించియున్నవాడవై; ధర్మభిః= గతి తప్పని నీ నియమాలతో; పవసే= పవిత్రంగా చేస్తూ ఉన్నావు; విశ్వస్వ= సంపూర్ణ; భువనస్య= విశ్వానికి; పతిః =ప్రభుడవై; విరాజసి= ప్రకాశిస్తున్నావు.
భావం:- సమస్తాన్ని ఒకేసారి దర్శించే ఓ విశ్వచక్షూ! సమస్త లోకాలను ప్రకాశింపచేసే మహిమాన్వితమైన నీ వైభవచిహ్నాలు అంతట కనబడుతున్నాయి. ఓ శాంతిప్రదాయకా! ఓ సోమా! సర్వత్ర వ్యాపించియుండిన నీవు నీ నియమనిష్ఠలచే సమస్తాన్ని పవిత్రంచేస్తూ ఉన్నావు. సమస్త విశ్వానికి ప్రభుడవై సర్వత్ర ప్రకాశిస్తున్నావు.
వివరణ:- దేవుడెక్కడున్నాడు? ఆయన ఉన్నాడనడానికి ఆధారాలేమిటి? అని లోకంలో చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. చిరకాలంగా అడగబడే రుూ ప్రశ్నకు సమాధానంగా వేదం- భగవానుడు అంతటా ఉన్నాడు. లోకాలను ప్రకాశింపచేసే వాటినికూడ ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాన్నంతను ఒకేసారి చూడగల శక్తిశాలి. అందుకే ఈ విశ్వమంతా ఆ పరమాత్ముడికి ప్రతీక. ఎవడికైనా తానున్న చోటొక్కటే అతడి ఉనికిని తెలియచేస్తుంది. భగవంతుడంతట నిండియున్నవాడు. కాబట్టి అంతట ఆయన ఉనికి కనబడుతుంది. అయితే చేయవలసినది ఆయనను చూడాలనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అదిచేస్తే ఆ సర్వత్ర వ్యాపకుడు కంటికి కానరాకుంటాడా?
లోకంలో ఉన్న వస్తువులన్నింటిని మనం మన కంటితో చూడగలమా? ఇది ఒక మార్మికమైన ప్రశ్న. మీ వెన్ను(వీపు) మీద ఏముంది? కనబడుతుందా? మీరు విజయవాడలో ఉన్నారు. మరి హైదరాబాదు కనబడుతుందా? లేదు కదా. అయితే అది లేదా? వెనుకనున్న వెన్నుపైకి కళ్ళు ప్రసరించవు. అట్లే దూరంగాఉన్న హైదరాబాదు కనబడదు. అట్లే వస్తువులు -దృశ్యాలు ఉన్నాకూడ కొన్ని కారణాలవలన అవి కంటికి కనబడవు. మిక్కిలి దూరంగా ఉండటం; అవరోధముండటం; మిక్కిలి దగ్గరగా ఉండటం; సమాన వర్ణ- పరిమాణాది వస్తువులలో బాగా కలిసిపోవడం; మిక్కిలి చిన్నవై ఉండటం; చాలా పెద్దవి కావడం; ఇలా అనేక కారణాలవల్ల వస్తువులు ఎదురుగా ఉన్నా కంటికి కానరావు. అన్నింటిని చూడగల కన్ను తనలో పడిన నలుసును చూడగలడా? లేదు. కారణం అది తన కత్యంత సమీపంలో ఉంది. అలాగే పరమాణువును శాస్ర్తియ ప్రమాణాలచేత గ్రహించగలమే గాని అది అత్యంత సూక్ష్మంగా ఉన్న కారణంగా కంటితో చూడజాలం. గోడ అవరోధంగా ఉన్న కారణంగా దాని వెనుకనుండే వస్తువులు కనబడవు. ఆవాలతో చేసిన దాణా ఆవాలలో కలిసిపోతే అవి ఒకే విధమైన వాటిలో కలిసిపోవడంవలన వాటిని విడదీయలేము. పాలలో వెన్నఉంది. కాని కనబడుతుందా? ఈ విధంగా భగవంతుడు ఒక మహా మహా రూపం.
ఏతా వానస్య మహిమా-తో జ్యాయాంశ్చ పూరుషః॥ శుక్ల యజు. 31-3
ఈ సర్వజగత్తు భగవంతుని మహత్వాకారమే. ఇక ఆయన నిజ స్వరూపం ఎంతో మహోన్నతం అని చెప్పిన శుక్లయజుర్వేద వచనానుసారం భగవద్రూపం మహోన్నతం కావడంవలన అది కంటికి కనబడదు. అంతేకాదు. ఆ బృహద్రూపం సమస్త వ్యాప్తికావడంవలన పాలలోని వెన్నలా కంటితో చూడజాలం. ‘అణోరణీయాన్’ అను ఉపనిషద్వచనానుసారం అత్యంత సూక్ష్మమైనది కావడంవలన పరమేశ్వరుడు చర్మచక్షువులకు అతీతమై ఉంటాడు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు