స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయామ్’(కఠోపనిషత్తు 1-2-20) పరమాత్మ ఈ జీవుని అంతరాత్మ గుహలో దాగియున్నాడు అన్న కఠోపనిషత్ వచనానుసారంగా ఆత్మ-పరమాత్మలొకే చోట అత్యంత సన్నిహితంగా ఉండిన కారణంగా ఆ పరమాత్మను ప్రత్యేకంగా జీవాత్మ దర్శించలేకుంది.
అయినా జ్ఞానులు తమ మనోజ్ఞాన నేత్రాలతో ఆ పరమాత్మను సన్నిహితంగానే దర్శించగలరు. కాని అజ్ఞానులకుమాత్రం ఆయన అత్యంత దూరమైయుంటాడు. ‘తద్దూరే తద్వంతికే’ (శు.యజు.40-5) భగవంతుడు ఎంత దూరమో అంతే దగ్గర అని శుక్లయజుర్వేదం చెప్పిందీ అభిప్రాయానే్న. అత్యంత సమీప వస్తువులను చూచేందుకు విశేష ప్రయత్నమవసరం లేదు. కాని అత్యంత దూరస్థమైన వానిని చూచేందుకు విశేష ప్రయత్నమవసరం. అందునా పరంజ్యోతి అత్యంత సూక్ష్మం; అత్యంత మహత్తు; అత్యంత దూరస్థం. అది సమస్త జీవులలో వ్యాపించియున్న అజ్ఞానావరణం చేత కానరాదు. కాబట్టి మానవుడు జ్ఞానసముపార్జన చేసి విశేష ప్రయత్నపరుడై పరదైవాన్ని దర్శించేందుకు సంసిద్ధుడు కావాలి.
***
ఋత మహిమ
ఋతస్య హి శురుధః సంతి పూర్వీః ఋతస్య ధీతిర్వృజినాని హంతి
ఋతస్య శ్లోకో బధిరా తతర్దకర్ణా బుధానః శుచమాన ఆయోః॥ ఋ.4-23-8.
ప్రతిపదార్థం:- ఋతస్య= సృష్టి నిత్యధర్మాలు; హి=మాత్రమే సత్యమైన; శురుధః = శక్తులు; పూర్వీశః= సనాతన కాలంనుండి; సంతి= స్థిరంగా ఉన్నాయి; ఋతస్య= సృష్టి నిత్య ధర్మాలను; ధీతిః= అధ్యయనం లేదా విచారణ చేయడం; వృజినాని= నిషిద్ధ కర్మల నాచరించుటవలన కలిగే పాపాలను; హంతి= నిర్మూలనం చేస్తుంది; బుధానః= ఆ ఋతాన్ని అర్థం చేసుకొంటూ; శుభమానః= మున్నతంగాచేసే; ఋతస్య శ్లోకః= ప్రశంస మరియు ప్రచారం; అయోః= మనుష్యుని; బధిరా= బయటి జ్ఞానపు; కర్ణా= చెవిని; తతర్ద= తెరుస్తుంది.
భావం:- సృష్టి నిత్యధర్మాలు(ఋతం) మాత్రమే నిజమైన శక్తులు. అవి సనాతన కాలంనుండి ఉన్నాయి. ఆ ధర్మాలను అధ్యయనం మరియు విచారణ చేయడంవలన సర్వపాపాలు నశిస్తాయి. ఆ ఋతాన్ని అర్థం చేసికొని చేసే ప్రచారం మరియు ప్రశంస మనిషిలోని జ్ఞాన శ్రోత్రాన్ని తెరుస్తుంది.
వివరణ:- సృష్టి నియమాలు చాల బలీయమైనవి. వానికనుకూలంగా నడచుకొనే మానవుడు సృష్ట్ధిర్మాలపై సంపూర్ణ అధికారాన్ని పొందగలడు. కాని వ్యతిరేకంగా నడచుకొంటే మాత్రం తన జీవితాన్ని నాశనం చేసుకొంటాడు. ఆవిరిశక్తిని కనిపెట్టి మానవుడు రైలింజను కనుగొన్నాడు. అగ్నిశక్తిని తెలిసికొని విమానాన్ని తయారుచేసుకొన్నాడు. విద్యుత్తులోని శబ్దవాహకతను గ్రహించి రేడియో కనిపెట్టాడు. కంఠంలోని స్వరపేటిక రహస్యాన్ని ఛేదించి శబ్దగ్రహణ యంత్రాన్ని (గ్రామఫోను) తయారుచేసాడు.
సృష్టిలో ఇలా పదార్థాలలో ఉండే ధర్మాలనే వేదం ‘ఋత’మని చెబుతూంది. ఈ ధర్మాలు నిత్యాలు. కాబట్టి అవి స్థిరాలు. అవి మారవు. మార్చబడవు. ఉదాహరణకు అగ్నిని చూడండి. వేడి మరియు కాంతి దాని స్వభావం లేదా ధర్మం. ఈ ధర్మాలను నశింపచేసి చల్లదనాన్ని మరియు చీకటిని అగ్నిలో నింపగల శాస్తజ్ఞ్రుడు ప్రపంచంలో ఇంతవరకు పుట్టాడా? చెవి ధర్మం వినడం. ఆ ధర్మాన్ని తొలగించి నాలుకవలె మాటలాడే ధర్మాన్ని కన్నువలె చూడగల ధర్మాన్ని చెవికి కల్పించగల తెలివిగలవాడు లోకంలో ఉన్నాడా? కంటికి చూచే శక్తి ఎవరైనా తమ తెలివితో సృష్టించారా? అలా ఎందుకు చేయలేదు? అలా చేయలేరు గనుక. ఎందుకు చేయలేరు? కేవలం పరబ్రహ్మ వానియందు స్వయంగా కల్పించిన అమృత శక్తులు లేదా ధర్మాలు గనుక. అవి బ్రహ్మచే దృఢంగా నిత్యంగా సృష్టింపబడిన శక్తులు.
ఈ నిత్యసృష్టి శక్తులకు విరుద్ధంగా ఆచరిస్తే మనిషికి కష్టాలు తప్పవు. ఇవి పాపకర్మఫలాలుగా మనిషికి సంభవిస్తాయి.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు