స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి నిత్యధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపం. పాపనివారణకు తరుణోపాయం సృష్టి నియమాల నుల్లంఘించకుండుటయే. అందుకు ముందు సృష్ట్ధిర్మాల విజ్ఞానం ముఖ్యావసరం. కేవలం ఆ జ్ఞానార్జన పాపనివారకం కాదు. దానిని మరలమరల ఆచరణచేయడం ఎంతో ముఖ్యం. దానివల్లనే పాప నివారణ అవుతుంది. అందుకే ఋగ్వేదం ‘ఋతస్య ధీతి ర్వృజినాని హంతి’ ఋతాన్ని(సృష్టి నిత్యధర్మాలు) తెలుసుకొని చరించడంవలన పాపం నశిస్తుంది అని ఈ మంత్రంలో స్పష్టం చేసింది. ఈ భావానే్న స్వీకరించి సంధ్యామంత్రాలలో ‘ఋతం చ సత్యం చ....’ ఇత్యాదిగా ఉన్న మూడు మంత్రాలు అఘమర్షణ= పాప సంహారక మంత్రాలుగా కీర్తించారు. వానికాశక్తి వానిలో ఋతాన్ని విశేషంగా ప్రశంసించడం చేతనే వచ్చింది. పాప నివారణశక్తి ఈ మంత్రాలలో ఎంత ఉందో వివరిస్తూ మనస్సులో పాప చింతన కలిగిన క్షణంలో ఈ మంత్రాలను జపిస్తే తొలగిపోతుందని వేదర్షులు భరోసాఇచ్చారు. జపమంటె ఒక మాటనో- నామాన్నో పలుమార్లు పలకడంకాదు. ‘తజ్జపస్తదర్థ్భావనమ్’(యోగ.ద.1-28) అర్థ విచారమే జపమన్న యోగదర్శన నియమానుసారం అర్థాన్నిగ్రహిస్తూ జపించాలి. అలా ఋతాన్ని గురించి అంటె సృష్టి నిత్య ధర్మాలను విచారించి వాని తత్త్వ రహస్యాలను సంపూర్ణంగా తెలిసికొని ఆచరిస్తే అంతశ్శ్రోత్రం అంటె అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా వినబడుతుంది. దానివలన ‘ఋతం వదన్ నృతద్యుమ్న’(ఋ.9-113-4) ‘ఋతాచరణ శీలుడు ఆ ఋతం చేత లోకంలో శ్లాఘనియుడవుతాడు’మరియు అతడి జీవితం ఋతమయమై ప్రకాశిస్తుంది అని చెప్పిన ఋగ్వేద వచనానుసారం సార్థకమవుతుంది. ఎందుకంటె ‘ఋతస్యదృఢా ధరుణాని సంతి’(ఋ.4-23-10) ఋతధారణ శక్తులు నిత్యాలు మరియు దృఢాలు కాబట్టి అలా సార్థకంకావడమే కాదు నిత్యజీవితం కూడ సంయమన శీలమై అంటె చెడుమార్గం వైపునకు ఇంద్రియాలు ప్రవర్తింపక క్రమబద్ధమైయుంటుంది. అందుకే ఆ సంయమనం ఋతంచేతనే సిద్ధిస్తుందని ఋగ్వేదం ‘ఋతం యేమాన ఋతమిద్ వనోతి’(ఋ.4-23-10) అని మరింతగా వర్ణించి నుతించింది. కాబట్టి మానవులు ఋతవ్రతులు కావాలి. ఈ విధంగా ఋగ్వేదం ఎంతో ప్రాముఖ్యమిచ్చిన ఋతానికి వ్యతిరేకమైన అనృతాన్ని= అసత్యాన్ని మానవుడు విధిగా విడిచిపెట్టాలని ‘ఇద మహ మనృతాత్సత్యముపైమి’ (యజు.2-5) ఋత విరుద్ధమైన అనగా సత్యవిరుద్ధమైన దానిని త్యజించి సత్యాన్ని అనగా ఋతాన్ని పొందెదనుగాక అన్న ప్రార్థనావాక్యం ద్వారా యజుర్వేదం ఋగ్వేద హృదయాన్ని విస్పష్టంచేసింది. వేదోక్తమైన ఋతమహిమ నెరింగిన తరువాత అనృతాన్ని (న ఋతం) ఎవడు ఆశ్రయిస్తాడు??
భగవంతుడు జగత్సర్వోత్పాదకుడు
బృహత్సుమ్నః ప్రసవీతా నివేశనో జగతః స్థాతురుభయస్య యో వశీ
సనో దేవః సవితా శర్మ యచ్ఛత్వస్మే క్షయాయ త్రివరూథ మంహసః॥ ఋ.4-53-6.
ప్రతిపదార్థం:- యః= ఎవడు; బృహత్సుమ్నః= శుభప్రదాయకుడో; ప్రసవీతా= విశ్వమహా సృష్టికర్తయో లేదా మహా శాసకుడో; అనుశాసక= గొప్ప ప్రేరకుడో; జగతః= కదిలే; స్థాతుః= కదలని; ఉభయస్య= ఆ రెండింటిని; నివేశనః = సృష్టించినవాడో లేదా వాటి యోగ్యతానుగుణంగా నిలిపేవాడో; వశీ= సమస్తాన్ని తన వశమందుంచుకొనేవాడో; సవితా= సర్వోత్పాదకుడో; నః = మాకు; దేవః = దైవమో; సః= ఆ భగవానుడు; అంహసః= పాపాల నుండి సంరక్షించి; అస్మే= మమ్ములను; క్షయాయ= జీవించేందుకు; త్రివరూధమ్ = ముల్లోకాలలో శ్రేష్ఠమైన ; శర్మ= శ్రేయస్సును లేదా ఆశ్రయాన్ని; యచ్ఛతు= అనుగ్రహించు గాక!
భావం:- శుభకరుడు, మహావిశ్వసృష్టికర్త, జగన్నియామకుడు, సర్వ ప్రేరకుడు, చరాచరాలను యోగ్యతానుగుణంగా స్థాపకుడు, సర్వ వశంకరుడు, సమస్తోత్పాదకుడు, మాకు దైవమూ అయిన ఆ భగవానుడు మమ్ములను పాపాల నుండి రక్షిస్తాడు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు