స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
మరి ముక్తికి అధికారులెవరు? అంటె మంత్రం పేర్కొన్నట్లుగా యజ్ఞియులే. అంటె యజ్ఞకర్మ ద్వారా నిష్కామ చిత్తవృత్తి కలిగిన మహాత్ములు. దీనినిబట్టి యజ్ఞకర్మ వినా ముక్తి సాధ్యంకాదు అన్నది స్పష్టం. మరి యజ్ఞమంటే ఏమిటి? చూడండి. మనవద్ద నేయి ఉందనుకోండి. దానిని తెచ్చి యజ్ఞాగ్నిలో వేసాం. ఆ నేయి తన సుగంధాన్ని స్వర్గందాకా వెదజల్లింది. అగ్నిలో నేతిని త్యాగం చేయడం వలననే కదా. త్యాగఫలమంటే ఇదే. మరి త్యాగమంటే? కేవలం నేయి అగ్నిలో వేయడం కాదు. ఆ పోసేటప్పుడు ‘ఇదం న మమ’ ఇది నాది కాదు అని నోటితో అంటూ వేయాలి. అదే ఆహుతి అనబడుతుంది. దీనినిబట్టి ఏదీ నాది కాదన్న భావంతో చేసే త్యాగకర్మకే యజ్ఞమని అర్థం. ‘త్యాగేనైకేన అమృతత్వమానశుః’ త్యాగం వలననే అమృతత్వం సిద్ధిస్తుంది అని ఉపనిషత్తు దీనినే నిర్ధారించింది. ఈ త్యాగశీలతకు ఆత్మ సంయమనం అనగా అంతరింద్రియ నిగ్రహమెంతో అవసరం. లేకుంటె త్యాగశీలత అలవడదు. అందుచేత సంయమనం మరియు త్యాగం రెండూ ఒకటే.
యథా యథా పతయంతో వి యేమిరే ఏవైన తస్థుః సవితః సవాయ తే॥
ఋ.4-54-5॥
ఓ సవితా! పడుతూ లేస్తూ ఎలా ఎలా సంయమనం పాటిస్తారో అలా అలా నీ ఆదేశాలను పాటించడంలో సుస్థిరంగా ఉంటారు అని ఋగ్వేదం ఇదే సూక్తంలో పునరుద్ఘాటించింది. ఈ రీతిగా త్యాగ- సంయమనశీలురై భగవదాదేశాల నాచరించేవారి భవబంధనాలను భగవానుడే త్రెంపివేస్తాడు.
‘ఆదిద్దామానం సవితార్వ్యూర్ణుషే’ అని ప్రస్తుత మంత్రం త్యాగశీలురకు ధైర్యం చెబుతూంది. ఈ వేదోపదేశ ధైర్యంతో త్యాగ- సంయమన భావంతో తమకు తాము భగవంతునకు ఆత్మసమర్పణ చేసికొనే మహాత్ములు భగవత్కృపతో భవబంధన విముక్తులై మోక్ష పదవిని పొందుతారు. అట్టి జీవన్ముక్త పురుషులు ఇహలోక భోగ సమాప్తి కొరకు నిరీక్షిస్తూంటారు.
***
57. జగమంతా నీ పరంధామమే
ధామంతే విశ్వం భువనమధి శ్రీతమంతః సముద్రే హృద్యంతరాయుషి
అపామనీకే సమిథే య ఆభృతస్తమశ్యామ మధుమంతం త ఊర్మిమ్‌॥
ఋ.4-58-11.
ప్రతిపదార్థం:- ఓ ప్రభూ! విశ్వం భువనమధి= సమస్త విశ్వంలో; తే= నీ; ధామన్= నివాసం లేదా శక్తి; తథా= ఆ రీతిగా ఉంది (అధ్యాహార్యం); సముద్రే హృది+ అంతః= సముద్రంతో సమానమైన హృదయంలో; ఆయుషి+అంతః= సమస్త జీవనసారంలో; శ్రీతమ్= నీ నివాసం లేదా శక్తి వ్యాపించియుంది; అపామ్+అనీకే= జలసముదాయంలో ; తథా= అదే విధంగా (అధ్యాహార్యం); సమిధే= సత్సంగంలో; యః= ఏ; తే= నీ; మధుమంతమ్= మధురమైన; ఊర్మిమ్= ఆనంద తరంగం; ఆభృతః= నింయుందో; తమ్= ఆ మధుమయ ఆనంద తరంగాన్ని; ఆ శ్యామ= మేము పొందెదము గాక!
భావం:= ఓ ప్రభూ! సమస్త విశ్వంలో నీ ధామం (నివాసం) లేదా శక్తినిండియుంది. అలాగే జీవుల సముద్రాన్ని పోలిన హృదయంలో మరియు జీవనసారంలో నీ ధామం లేదా శక్తి నిండియుంది. జలంలో మరియు సత్సంగంలో ఏ నీ మధుమంతమైన ఆనందతరంగం నిండియుందో దానిని మేము పొందెదముగాక!
వివరణ: భగవంతుడి నివాసమెక్కడో వివరిస్తూ వేదం ఓ మానవుడా! ఆయన నీ హృదయమనే సముద్రంలో ఉన్నాడు. సారవంతమైన నూరేండ్ల నీ జీవనమంతటా ఉన్నాడు. అక్కడకు ఇక్కడకు ఎందుకు తిరుగుతావు? కళ్లుంటే నీ హృదయంలోకి చూడు. నిష్ఠగా ధ్యానం చేయి అని హెచ్చరించింది. ఈ విషయానే్న ఛాందోగ్యోపనిషత్తు అత్యంత రమణీయంగా ఇలా వివరించింది.