స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ప్రీతిచేత సత్యాన్ని మాటిమాటికి తప్పక తెలుసుకో అని ఋగ్వేదమహర్షి ‘ఋతమిచ్చికిర్థి’అని బోధచేసాడు. ఈ సత్యధర్మ మీనాటిది కాదు. మరి ఏనాటిదో తెలియదు. అందుకే అది సనాతనం. అది అవ్యాహతంగా నేటికీ స్థిరంగా వస్తూంది. కాబట్టి సనాతనమైన ఆ సత్య విచారధారా జ్ఞానాన్ని అనుకూలంగా గ్రహించుమని ‘ఋతస్య ధారా అనుతృంధిపూర్వీః’॥ ఋ.5-12-2 అని వేదం హితవు పలికింది.
పైకి సత్యం వలె కనబడుతూ నీతియుక్తంగా ఉంటూ అంతరికంగా అవినీతిమయమూ అసత్య మిశ్రీతమూ అయిన సత్యానికి నిత్యం వేదం విరోధి. పరిశుద్ధమూ మరియూ భ్రాంతి రహితమూ అయిన కేవలం సత్యానే్న ఆమోదించి వేదం బోధిస్తుంది. అందుకే మంత్రంలో ఆరంభంలోనే ఋత శబ్దాన్ని ప్రయోగించింది. ‘ఋతమ్’= సృష్టి నియమం అనాదినుండి ఉంది. అది పరిణామ రహితమైనది. ధార్మికులెన్నడు ద్వంద్వ వైఖరి నవలంబింపక సత్యానే్న ఆశ్రయిస్తారు. ఆచరిస్తారు. వేదర్షి ఈ భావానే్న సుందరమైన భాషలో మంత్ర ద్వితీయార్థంలో ఇలా వర్ణించాడు.
నాహం యాతుం సహసా న ద్వయేన ఋతం సపామ్యరుషస్య వృష్ణః॥ ॥

భావం:- మూర్ఖపు పట్టుదలచేత గాని ద్వంద్వ వైఖరి ప్రవర్తనవలన గాని రాక్షసుడిగా మారను. అక్రోధమూ- శుభప్రదమూ అయిన ఋతాన్ని మాత్రమే ఆశ్రీయిస్తాను. దానినే వహిస్తాను. భగవానుడు అక్రోధుడు. శుభప్రదుడు. ఆయన నియమించిన ఋతం కూడ శుభప్రదమూ. అక్రోధమూ. ఇట్టి అబాధిత సత్యమైన ఋతాన్ని తెలిసికొని గుర్తించి, మనస్ఫూర్తిగా విశ్వసించి ఆశ్రయిస్తాను.

****

66. శత్రు మిత్రుల గుర్తింపు
కే తే అగ్నే రిపవే బంధనాసః కే పాయవః సనిషంత ద్యుమంతః
కే ధాసిమగ్నే అనృతస్య పాంతి క ఆసతో వచనః సంతి గోపాః॥ ఋ.5-12-4॥

ప్రతిపదార్థం:- అగ్నే= ఓ అగ్నిదేవా!; రిపవే= శత్రువుకొఱకు తగిన; తే = నీ; బంధనాసః= బంధనాలు; కే=ఎటువంటి శక్తివంతమైనట్టివి; సంతి= అయి ఉన్నాడా? (అధ్యాహార్యం); ద్యుమంతః= మహాశక్తివంతుడైన; పాయవః= రక్షకుడు; కే= ఎవరిచేత; స నిషంత= సత్కరింపబడతాడు; అగ్నే= ఓ అగ్నీ! శత్రు- మిత్రులను గుర్తించే జ్ఞానప్రదాతా!; అనృతస్య= అసత్యమనే; ధాసి= బంధనాన్ని లేదా అసత్యవాదిని; కే= ఎవడు?; పాంతి= రక్షిస్తాడు?; ఆ+సతః= నిత్యసత్యమైన; వచసః= వచనాలనే పలుకు పురుషునకు; గోపాః= రక్షకులు; కే=ఎవరు?; సంతి= ఉన్నారు;
భావం:- ఓ అగ్నిదేవా! శత్రువులను బంధింపగల సమర్థవంతమైన నీ బంధనాలు ఏమున్నాయి? మహాశక్తివంతుడైన రక్షకుడు ఏవిధంగా రక్షింపబడతాడు. ఓ అగ్నీ! మిత్రులను శత్రువులను గుర్తింపగల జ్ఞాన ప్రదాతా! అసత్య బంధనాలను- అసత్యవాదిని ఎవడు రక్షిస్తాడు? నిత్య సత్యవచనుణ్ణి రక్షించేవారెవరు?
వివరణ:- శత్రువులెవరో మిత్రులెవరో గుర్తించే విధానమీమంత్రంలో సూచింపబడింది. అలాగే శత్రుబంధన విధానం మరియు మిత్ర సత్కార రీతి కూడ ఇచట ఆదేశింపబడింది. లోకంలో ఒకడు మరెవరికైనా అపకారంచేస్తే అతడు వానికి శత్రువు. అదే విధంగా ఒకడు మరెవరికయినా ఉపకారం లేదా సంప్రీతిని కలిగించితే అతడు వానికి మిత్రుడు. అపకారి చేసే హాని సంభవించకుండ నిరోధించే ఉపాయమే ఇచటి ప్రతిబంధనం. దానివలన ఇతరులకు జరిగే హాని నిరోధింపబడుతుంది. అలా హాని జరుగకుండ చేసేందుకు మిత్రుని రూపంలో వచ్చే రక్షకునే ఈ మంత్రం ‘పాయు’అని పేర్కొంది.
హంతకుని కంటె రక్షకుడు సర్వశ్రేష్ఠుడిగా గౌరవింపబడతాడు. చతురత ధ్వంసం లేదా నాశనం చేసేందుకు కాదు నిర్మించేందుకు అవసరం. అందుకే సంరక్షకుడు ప్రీతిపాత్రుడవుతాడు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు