స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయాన్ని గురించి స్వామి దయానంద సరస్వతి ఇలా అన్నారు.
‘‘పరమేశ్వరుడిని త్రికాలవేది అని చెప్పడం అవివేకం. ఎందుకంటె వెనుక జరిగి ఇప్పుడది లేకుంటే అధి భూతకాలం. వెనుకలేక ముందు జరుగబోయేది భవిష్యత్తు. ఈశ్వరుని జ్ఞానం వెనుక లేనిదై ఇప్పుడు క్రొత్తగా ఉంటుందా? లేక వెనుక-ఇప్పుడు లేనిది ముందుంటుందా? అసంభవం కదా. కాబట్టి దైవజ్ఞానం అఖండమై ఏకైకమై నిరంతరం ఉంటుంది. భూత-్భవిష్యత్- వర్తమానాలనేవి జీవులను ఉద్దేశించి చెప్పబడినవి మాత్రమే. అంటే దైవం త్రికాలవేది అన్నమాట భూత-్భవిష్యత్- వర్తమాన కాలాలలోని కర్మలన్నింటిని దర్శించే భగవంతుడు చూచే సాపేక్ష దృష్టి విభాగించి చెప్పినదే గాని భగవంతుని జ్ఞానమఖండమైనట్టిదే.
కాబట్టి మంత్రంలో చెప్పబడిన పరమేశ్వరుని త్రికాలజ్ఞత జీవులకు సంబంధించనట్టిదే. బ్రహ్మము త్రికాల భేదాతీతంగా సమస్తాన్ని ప్రత్యక్షంగా చూస్తూంది. ఈ ప్రత్యక్ష దర్శనాన్ని గురించి ఋగ్వేదమే దీని పూర్వమంత్రమైన-
ని షసాద ధృతవ్రతో వరుణః పస్త్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః॥ ఋ.1-25-10లో ‘‘సమస్త ధర్మాచరణుడు, శ్రేయః కర్మఠుడు, సర్వశ్రేష్ఠుడైన భగవానుడు సర్వాజ్యార్థంగా ఏకైక రూపంగా ప్రకాశించేందుకు ప్రకృతిలో, సమస్త జీవులలో పరిపూర్ణంగా, సర్వదా, సర్వధా విరాజమానుడై ఉన్నాడు’’ అని మరింత విపులీకరించింది. దైవానికి గల ప్రత్యక్ష దర్శనానికి హేతువేమిటో ఈ మంత్రం ‘సుక్రతుః’ అన్న ఒక చిన్నమాటలో వివరించింది. ‘సుక్రతుః’ అంటె శ్రేష్టమైన, శ్రేయస్కరమైన కార్యాలను నిర్వహించేవాడని అర్థం. ఏ విధంగా? అంటె సమస్త స్థానాలలో సర్వదా వ్యాపించి జ్ఞానపూర్వకంగా కార్యాలను నిర్వసిస్తున్నవాడు కాబట్టి. అట్టి సృష్టకర్తకు తాను సృష్టించిన సృష్టిజాల జ్ఞానమెందుకుండదు? అందుకే ఆయన జ్ఞానం కాలాతీతం. అంతేకాక నిత్యమైన కాలానికి భూత- భవిష్యత్- వర్తమాన గణన అసంభవం. కాకపోతే అల్పజ్ఞుడైన జీవుని దృష్ట్యా మాత్రమే అట్టి కాలగణన చేయబడుతుంది. మరి భగవంతుడికో కాల మఖండంగా ఒక్కటే.
పై చెప్పబడిన సుక్రతు శబ్దంలో ఒక మార్మికత ఉంది. పరమాత్ముడు సదా శ్రేష్ఠం- శ్రేయస్కరం అయిన కర్మలనే నిర్వహిస్తాడు. ఆయన కర్మలలో లేశమయిన దోషముండదు. జీవుల దృష్టిదోషం వలననే భగవత్కృత్యాలలో దోషమున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది. భగవంతుడు సర్వదా ధృతవ్రతుడు. ఆయన నియమాలను ఏర్పరచడు. కాని నియమాలను ఆచరిస్తాడు. అందుచే పరమాత్మ వరుణుడు. సర్వజీవులకు సదా ఆశ్రయణీయుడు. ఆదర్శణీయుడు.
**
దురభిమానులు దైవాన్ని అణచివేయజాలరు
న యం దిప్సంతి దిప్సవో న ద్రుహ్వాణో జనానామ్‌
న దేవమభిమాతయః॥ ఋ. 1-25-14॥
భావం:- ఇతరులను బాధించి అణచివేసే స్వభావం గలవారు నిజానికి ఎవరిని అణచివేసి బాధింపలేరు. ఆ విధంగా జనులను బాధించాలని తలంచే ద్రోహులు ఎవరిని బాధింపజాలక తామే భంగపడతారు. దురభిమానులు దైవాన్ని అణచివేయజాలరు.
వివరణ:- లోకంలో జీవుల శక్తి ఒకే విధంగా ఉండదు. తరతమ భేదాలతో ఉంటుంది. బలవంతుడు దుర్బలులను అచివేయడం లేదా బాధించడం నిత్యమందరకు కనబడే వ్యవహారమే. పరిశీలించి చూస్తే చైతన్యం గల జీవులలోనే కాదు జడ పదార్థాలలో కూడ ఈ పద్ధతి స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. ధనవంతుడు నిర్ధనుణ్ణి; రాజు ప్రజల్ని, తెలివిగలవాడు తెలివి తక్కువవాడిని బాధిస్తూ ఉంటారు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు