స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే సూర్యుడు తన ఆకర్షణ- వికర్షణల బలంచేత భూమిని తన అదుపులో ఉంచుకొంటున్నాడు. చంద్రుణ్ణి భూమి తన ఆకర్షణ శక్తి చేత తన చుట్టూ తిరిగేవానిగా చేసికొంటూంది. మరి చంద్రుణ్ణో సముద్రానే్న సంక్షోభానికి గురిచేస్తున్నాడు. సముద్రం! తీర ప్రాంతాలను కోతకు గురిచేస్తోంది. అగ్ని నీటిని ఆవిరి చేస్తోంది. నీరు నిప్పును ఆర్పివేస్తోంది. పెనుగాలి ఇండ్లను, వృక్షాలను కూల్చివేస్తోంది. బండరాళ్ళు నదీ ప్రవాహాలను అడ్డగించి వేస్తాయి. నదులు బండరాళ్లను ముక్కలు ముక్కలుగా చేస్తాయి.
విచారించి చూస్తే సృష్టిలో అంతటా ద్వందాల మధ్య వైరుధ్యం ప్రబలంగా ఉన్నట్లు కనబడుతుంది. చూడగా చూడగా మహాబల సంపన్నత చేత దురభిమానం కలిగి చివరికి దైవంతో కూడ పోటీపడే స్థితికి మనిషి ఎదిగిపోయాడనిపిస్తుంది. ఈ సందర్భాలను గమనించియే వేదం ‘న యం ద్పిసంతి దిప్సవః’ ‘‘ఇతరులను తన బలాధిక్యం చేత వశపరచుకోవాలని కోరుకొనేవాడు ఎవరిని ఆ విధంగా వశపరచుకోలే’’డని నిష్కర్షగా చెప్పింది. అసలా రీతిగా బలాధిక్యం చేత అణచివేయడం గాని వశపరచుకోవడం గాని సాధ్యమా? కాదు. ఎందుకంటె ఆ భగవంతుడే సర్వాధికశక్తిశాలి. ‘అదబ్ధాని వరుణస్య వ్రతాని’ (ఋ.1-24-10) అని ఋగ్వేదం పేర్కొన్నట్లుగా ‘‘వరుణ భగవానుని వ్రత= నియమ నిమంధనలు ‘అదబ్ధాని’= అచంచలమైనవి.’’ వానిని ధిక్కరించి ‘విచాకశశ్చంద్రమా నక్తమేతి’ (ఋ.1-24-10) చంద్రుడు రాత్రి గాక పగలు అన్నింటిని ప్రకాశింపచేస్తూ ఉదయిస్తాడా? అలా కాక చంద్రుణ్ణి పగలు ప్రకాశమానుడై ఉదయింపచేసే శక్తివంతుడున్నాడా? ఎన్ని శక్తియుక్తులు ప్రయోగించినా చంద్రుడు రాత్రే గాని పగలు ఉదయించడు. ఇంత చిన్న సృష్టి నియమాన్ని మార్చలేనివాడు మహా బలసంపన్నుడైన దైవాన్ని ఎదిరించగలడా? అందుచేత ‘న ద్రుహ్వాణో జనానామ్’ ఎంతటి ప్రజాద్రోహులైనా భగవద్భక్తుని బాధించి అణచివేయలేరు. అట్టి ఎడల సామాన్యజనులను మాత్రం పుట్టిన/ పుట్టబోయే వారి శత్రువులు సహితం బాధించేందుకు సమర్థులు కాగలరా? అలా వారిని అసమర్థులుగా చేసే దైవస్వరూప మెట్టిదో ఋగ్వేదం.
స నో విశ్వాహా సుక్రతురాదిత్యః సుపథా కరత్ ప్ర ణ ఆయూంషి తారిషత్‌॥
ఋ.1-25-12॥
భావం:- ఆ భగవానుడు సుక్రతురాదితయః = విశ్వాత్ముడైన ఏకైక పరబ్రహ్మం. ఆయన జీవులకు సుపథ= ఒక సన్మార్గాన్ని వ్యవస్థీకరించాడు. ఆయననే జీవులందరి జ్ఞానాన్ని- ఆయువును ఇతోధికంగా ప్రదానం చేస్తాడు అని నిర్దేశించింది. ఎవడు ఆదిత్యుడో అనగా అచ్ఛేద్యుడో ఆ దైవాన్ని ఎవరు ఛేదింపగలరు? ఆయన వ్యవస్థీకరంచిన సన్మార్గం సుస్థిరం. దానిని అనుసరించి ఉంచుటయా? లేక వ్యతిరేకించుటయా? అన్నది మనుష్యుల ఇచ్ఛమీద ఆధారపడి యుంది. దైవం మీద ప్రేమ, విశ్వాసం, భక్తికలవాడు దైవమార్గాన్ని వీడి దుర్మార్గ ప్రవర్తనుడు కాగలడా?
**
పరమ జ్ఞానధనప్రదాతవు నీవే
త్వ మగ్న ఉరుశంసాయ వాఘతే స్పార్హం యద్రేక్ణః= పరమం వనోషి తత్‌
ఆధ్రస్య చిత్ప్రమతిరుచ్యసే పితా ప్ర పాకం శాస్సి ప్రదిశో విదుష్టరః॥
ఋ.1-31-14॥
భావం:- ఓ సర్వాభ్యుదయ అగ్నిదేవా! ఏది కోరదగిన సర్వోత్కుృష్ట ధనమో దానిని నీ ఉపాసకునకు సంప్రీతితో అనుగ్రహిస్తున్నావు. దుర్బలుడైన వానికి తండ్రివై జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నావు. జ్ఞాన సంపన్నత చేత పవిత్రాత్ముడైన మహా జ్ఞానికి సమస్త జ్ఞాన స్వరూపాన్ని ప్రీతితో సలక్షణంగా తెలుపుచున్నావు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు