స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడమైన ప్రకృతికి దానినుండి పుట్టిన జీవానికి ప్రాణ చైతన్యాన్ని ప్రదానంచేసేవాడు కేవల మాదైవమే. మానవుడిగా పుట్టి దైవసమానుడవుకావాలని కోరుకొంటె నీవు కూడ ఈ జడ ప్రకృతిలో జీవనాన్ని నింపేవాడవుకమ్ము అని పై వేదమంత్ర పరమార్థ బోధన.
ఈ రీతిగా సందేశమిచ్చి దైవస్థితికి చేరినవారి కర్మరహస్యమేమిటో మంత్రంలో ద్వితీయార్థమైన ‘్భజంత... అమృతమేవైః’అన్న వాక్యం ద్వారా వారు తమ దివ్యజ్ఞానకర్మ విశేషాచరణ చేత, సృష్టి నియమ విధేయశీలం చేత దైవత్వాన్ని పొందారని వివరించింది. ఇదే విషయాన్ని ఋగ్వేదమే-
ఋతస్య దేవా అనువ్రతా గుః॥ ఋ.1-65-2॥
అనే మరో మంత్రంలో దేవతలు ‘ఋతస్య అనువ్రతాః’ సృష్టి నియమాలకు అనుకూలంగా ప్రవర్తిస్తారని పునరుద్ఘాటించింది. వారు కూర్చున్నా, నిలబడినా, తిరిగినా, ఆహారం గ్రహించినా, జీవులతో వ్యవహరించినా అన్నీ ఋత= నియమానుసారంగానే ఉంటాయి. అట్టి ఋతానుసార ప్రవర్తనవలననే వారు ముక్తినిపొంది తద్వారా దివ్యులయ్యారు.
సందర్భం కాబట్టి అందరూ ఈ విషయాన్ని తప్పక గమనించాలి. అదేమంటె దేవతలు విలక్షణంగా పుట్టినవారు కారు. వేదనిఘంటుకర్త అయిన యాస్కుడు ‘దేవో దానాత్’అని చెప్పిన వాక్యానుసారం దానం వలననే దేవతలయ్యారన్న సత్యాన్ని మరచిపోరాదు. బ్రహ్మనుండి తృణపర్యంతమూ సకల పదార్థాలు దైవతుల్యులు కావడానికర్హులయినా ప్రధాన దైవగుణమైన దానశీలంచేత ఉన్నతస్థాయికి చేరిన జీవులు లేదా మానవులే దేవతాస్థానాన్ని అందుకోగలరు.
కర్మ ప్రాముఖ్యం
శుక్రః శుశుక్వా ఉషో న జారః పప్రా సమీచీ దివో న జ్యోతిః
పరి ప్రజాతః క్రత్వా బభూథ భువో దేవానాం పితా పుత్రఃసన్‌॥
ఋ. 1-69-1॥
భావం:- సూర్యుడు ఉషఃకాంతులను హరించి ప్రకాశించే రీతిగా జీవుడు తన పాపాలను సత్కర్మాచరణ చేత హరించికొంటున్నాడు. ఆ జీవుడే పగటిపూట సూర్యునివలె భూమ్యాకాశాలమధ్య, సత్కర్మాచరణ చేత, తన కీర్తిని వ్యాపింపచేసుకొంటున్నాడు. అన్నీ తెలిసిన జీవుడు తన కర్మల కారణంగా పుత్రుడై పుట్టి ఇంద్రియాలకు తండ్రియగుచున్నాడు.
వివరణ:- సూర్యుడు ఉషస్సును సమాప్తపరచి ఉదయిస్తాడు. శుక్ర= పరిశుద్ధకర్మ పరాయణుడైన జీవుడు శుక్ర= తన సామర్థ్యంచేత తన పాపరాశిని నాశనం చేసుకొంటాడు. సూర్యుడు తన ప్రకాశాన్ని భూమ్యాకాశాలలో నింపుతాడు. జీవుడు కూడ సత్కర్మ ఫలరూపమైన యశఃకాంతులతో భూమ్యాకాశాలను ప్రకాశింపచేస్తాడు. కర్మాధీనుడయ్యే జీవుడు భువిపై జన్మిస్తున్నాడు. ప్రసిద్ధమైన ఈ విషయాన్ని ‘పరిప్రజాతః కృత్వా బభూథ.’ ‘‘స్వకర్మ కారణంగానే జీవుడు ప్రసిద్ధుడవుతున్నాడు’’అని వేదం ధ్రువీకరించింది. ప్రబలమైన జీవుని కర్మను గురించి వేదం రెండవ పాదంలో ‘్భవో దేవానాం పితా పుత్రః సన్’ పుత్రుడుగా జన్మిస్తున్న ఆత్మ ‘దేవ’ = ఇంద్రియాలకు తండ్రి అవుతున్నాడు అని స్పష్టంచేసింది. సామాన్యంగా జీవుడు (ఆత్మ) జన్మను పొందితే ఎవరోఒకరికి కుమారుడు కావడం తథ్యం. ఆత్మ (జీవుడు) అయితే పుత్రుడుగా పుట్టింది. కాని దాని కర్మల మహిమను చూడండి. ఇంద్రియాలకు మాత్రం తండ్రి అయింది. తండ్రిగా ఆ ఆత్మ లేదా జీవుడే ఇంద్రియాల సంరక్షణ చేయవలసియుంది. కాని ఆ సంరక్షణను ఉపసంహరించి ఆత్మ (జీవుడు) శరీరాన్ని విడిచిపెడితే శరీరగతమైన కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే ఇంద్రియాలలో ఏ ఒక్కటి శరీరంలో నిలిచి యుండవు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు