స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది సామాన్య విషయమైన అంత్యకాలంలోగాని జీవుడికి నిజంగా స్వానుభవంలోనికి రాని ఈ నిత్యసత్యాన్ని యస్య ప్రయాణమస్యన్య ఇద్యాయు ర్దేవా దేవస్య మహిమాన మోజసా ప్రథమ దేవ సమానుడైన ఆత్మ ప్రయాణ (శరీర త్యాగం) సమయంలో ద్వితీయమైన దేవసమానమైన ఇంద్రియాలన్నీ వెంటనే ప్రయాణమై ఎటుకో వెళ్లిపోతాయి అని శుక్ల యజుర్వేదం (11-6) మానవ సమాజానికి జ్ఞప్తికి తెచ్చింది.
కర్మ సిద్ధాంతం వైదికధర్మంలో చాల ప్రముఖమైంది. ఇది కేవలం మానవ జాతికే మానసిక స్వాంతనను చేకూర్చుతుంది. ఆత్మవిశ్వాసం కూడ కలిగిస్తుంది. దానిద్వారా మానవుడు చతుర్విధ పురుషార్థమయ జీవనాన్ని గడిపేందుకు సుముఖుడవుతాడు.
పుత్రుడైన జీవాత్మ ఇంద్రియాలకు తండ్రిగా భావింపబడటం ఉత్తమమైనది మరియు ఆచరణీయమైనది. వేదాలలో కర్మప్రాధాన్యమెంత ఘనమైనదో ‘కృతం స్మర’చేసిన కర్మను స్మరింపుమని శుక్లయజుర్వేదం మరణోన్ముఖుడైన మనుజుని భగవదాదేశంగా ప్రకటించడం ద్వారా స్పష్టమవుతూంది. మనుష్యులు మరణ సమయంలో వ్యాకులపడుతూ ఉంటారు. కాళ్లుచేతులు కొట్టుకొంటూ ఉంటారు. కొందరయితే దైవాన్ని దూషిస్తూ ఉంటారు. అట్టివారినుద్దేశించి భగవంతుడు ఆ సమయంలో నన్నుకాదు నిందించడం. నీవుచేసిన కర్మలను జ్ఞప్తికి తెచ్చుకో. మృత్యుసమయంలో పుత్ర- మిత్ర-కళత్రాదులలో ఏ ఒక్కరూ వెంటరారు. అంతా ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు జీవుడొక్కడే ఒంటరిగా ప్రయాణించవలసి యుంటుంది. అయితే చేసిన కర్మ మాత్రం వెంట ఉంటుంది అని కర్మను స్మరింపుమన్న భగవంతుని ఆంతర్యం. ‘కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః’ కర్మమాత్రమే జీవుణ్ణి అనుసరించి వెళ్లుతుంది అన్న సూక్తి కూడ ఈ భగవదాజ్ఞనే స్ఫురింపచేస్తూంది.
యాత్రా సమయంలో ఎవరైనా తోడుంటే మంచిది. ఒంటరిగా ఉంటే భయం కలుగుతుంది. అయితే ఆ రీతిగా ఉండేతోడు మంచివాడై యుండాలి. మరి తోడువచ్చేది కర్మయే కాబట్టి అది చెడు కర్మ అయితే మాత్రం భయానే్న కలిగిస్తుంది. అందుచేత సత్కర్మలనే అంటే యజ్ఞయాగాది పుణ్యకర్మ విశేషాలను వెంటతీసికొని వెళ్లే ప్రయత్నంచేయాలి. అప్పుడే యాత్ర నిర్భయమై సాఫల్యవౌతుంది. ***

యజ్ఞం దైవత్వ ప్రాప్తికి సాధనం
అయం యజ్ఞో దేవయా అయం మియేధ ఇమా బ్రహ్మాణ్యయమింద్ర సోమః
స్తీర్ణం బర్హిరా తు శక్ర ప్ర యాసి పిబా నిషద్య వి ముచా హరీ ఇహ॥
ఋ.1-177-4॥
భావం:- ఓ ఇంద్ర! ఈ యజ్ఞం దైవం వద్దకు చేర్చగల శక్తివంతమైనది మరియు పవిత్రంగా కూడ చేయగలది. సోమరసమూ మరియు ఆసనమూ సిద్ధం చేయబడినవి. నీవు వచ్చి సుఖాసీనుడవై ఈ సోమరసాన్ని త్రాగు. గుఱ్ఱాలను విడిచిపెట్టు.
వివరణ:- యజ్ఞం జరుగుతూ ఉంది. దేవతలను మరియు ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తూ ఆసనాలు సమర్పింపబడుతున్నాయి. దేవతలారా! ఈ యజ్ఞంలో మీరందరు సమావేశం కండి. ‘స్తీర్ణం బర్హిరా తు శక్ర ప్ర యాహి’ ఆసనాలు సిద్ధం చేయబడ్డాయి. మీరు వచ్చి ఆసీనులుకండి’ అని ఋత్విజులు స్వాగతం పలుకుతున్నారు. ఆ రీతిగా యజ్ఞానికి వచ్చిన దేవతలను దర్శించి వారిని సమీపించేందుకు మనిషి పవిత్రుడు కావాలి. యజ్ఞానికి వచ్చిన వారందరు పాపాలు ప్రక్షాళితం చేసి పవిత్రులుగా చేస్తుంది యజ్ఞం. ఎందుకంటె ‘అయం యజ్ఞోదేవయా అయం మియేధుః’ ఈ యజ్ఞం మానవులను దైవత్వ స్థాయికి గొనిపోగల సమర్థవంతమైనది. ‘ఇతి స్వతః’ పవిత్రమైనది. మరియు అపవిత్రులను పవిత్రులుగా చేయగల మహత్తుగలది’’ పవిత్రమైన దాని సాంగత్యం చేతనేకదా పవిత్రత సిద్ధించేది. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు