స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞానికి ఆహూతులైన దేవతలనెందుకు కలుసుకోవాలి? శాంతికోసం. మరియు సోమరస పానం కోసమే. అయితే అందరూ వచ్చి ‘పిబా నిషద్య’ కూర్చుని త్రాగండి అని యాజ్ఞికులచే ఆహ్వానం పలుకబడింది. కూర్చోవడం మనసునకు గల చంచలతను పారద్రోలే స్థితికి సంకేతం. అసలు త్రాగినా- తిన్నా కూర్చుండి మాత్రమే చేయాలి. వైద్యులు కూడ ఆ మాటనే చెబుతారు. ప్రస్తుతం యజ్ఞానికి వచ్చినవారు త్రాగేది సోమరసం కదా. కాబట్టి దానికో ముఖ్యమైన నియమముంది.
ఏమంటే- ‘వి ము చా హరీ ఇహ’ గుఱ్ఱాలను అనగా మనస్సు కల్పించే సంకల్పం మరియు వికల్పమనే రెండు గుఱ్ఱాలను విడిచిపెట్టమన్నదా నియమం. మనిషి మనసుకు సహజంగా ఉన్న చంచలతకు మూలం సంకల్ప వికల్పాలనేవి రెండే. అవే మనిషి నొకచోట నిలువనీయక పలుచోట్లకు ఈడ్చుకొనిపోతాయి. అందుకే ఆ రెండింటిని గుఱ్ఱాలతో పోల్చారు. భాషలన్నింటిలో సంకల్పాలు గుఱ్ఱాలతోనే పోల్చబడ్డాయి. సంకల్ప-వికల్పాలనే గుఱ్ఱాలను విడువనంతవరకు ఎవరూ సోమపానం చేయలేరు. అన్న-పానీయాలకు ప్రత్యేకత ఒకటి ఉంటుందని వైద్యులు చెబుతారు. ఆ సమయంలో మనస్సులో పుట్టే సంకల్పాలను విడువకుంటె అన్నపానీయాలు ఒంటబట్టవు. కాబట్టి పరమ పానీయమైన సోమపానం చేసే సమయంలో మనస్సునగల సంకల్ప-వికల్పాలను విడువకుంటే ఎంత హానికరమో ఊహించడమెవరికీ కష్టమైన పనికాదు. అయితే హఠాత్తుగా సంకల్ప వికల్పాలను విడిచిపెట్టడం అనుకొన్నంత సులభమైన పనికాదు. ఈ విషయాన్ని సమర్ధిస్తూ ఋగ్వేద మీవిధంగా వివరించింది.
యే తే వృషణోవృషభాస ఇంద్ర బ్రహ్మయుజో వృషరథాసో అత్యాః
తాం ఆ తిష్ఠ తేభిరా యాహ్యార్యాజ్ హవామహే త్వా సుత ఇంద్ర సోమే

అత్యంత పరిపుష్టమూ, సుఖమయమూ అయిన రథం(శరీరం) కలిగిన మరియు బ్రహ్మయుక్త అనగా పరబ్రహ్మతో సంయోగపరచే మిక్కిలి సుఖకరమైన నీ గుఱ్ఱాలు ఏవి కలవో వానిపై అధిరోహించి రమ్ము మేము సోమ రసం సిద్ధమైనంతనే మిమ్ము ఆహ్వానిస్తాం.
సంకల్పాలు తొలగకపోతే వానిని బ్రహ్మమయంగా చేసివేయి. అప్పుడు సోమరసం నీకు లభ్యంకావడానికి ఆలస్యముండదు. సంకల్ప- వికల్పాలనుండి విడివడేందుకు వేదమెంత చక్కని ఉపాయం చెప్పింది. సంకల్పాలను బ్రహ్మమయం చేయడమే వానిని తొలగించడమంటే. మనస్సు ఒక సమయంలో ఒక సంకల్పాన్ని మాత్రమే చేస్తుంది. మనస్సు బ్రహ్మమయ సంకల్పం చేసిన తరుణంలో ప్రాకృతికమైన సంకల్పాలన్నీ ఆ బ్రహ్మమయ సంకల్పంలో విలీనమైపోతాయి.
వనంలో గృహస్థ ధర్మం

పూలర్వీరహం శరదః శ శ్రవాణా దోషా వస్తోరుషసో జరయంతీః
మినాతి శ్రీయం జరిమా తనూనామప్యూ ను పత్నీర్వృషణో జగమ్యుః
- ఋ.1-179-1॥
భావం:- ఉదయాలను, రాత్రింబవళ్ళను హరిస్తూ శరీరానికి అలసట కలిగించే ఎన్నో ఏండ్లు గతించిపోయాయి (బ్రహ్మచర్యంలో). వృద్ధాప్యమేమో శరీర సౌందర్యాన్ని హరించి వేస్తుంది. ఇక భార్యలు వీర్యవంతుడైన పురుషుణ్ణీ కోరుకొని వారిని పొందేందుకిష్టపడతారు.
వివరణ:- విద్యాభ్యాసం- తపస్సు మున్నగు వానివలన జీవితంలోని ప్రథమ భాగమైన బాల్యకౌమార దశలు శరీరశ్రమతో గడిచిపోయాయి. విద్యాభ్యాసంలో నిమగ్నమైన వాడికి రాత్రియేదో- పగలేదో తెలియనే తెలియదు. ఆ కాలంలోని విద్యార్జన- తపస్సు బ్రహ్మచర్య నిష్ఠలవలన శరీరం దుర్బలంగా ఉంటుంది. శరీరంలోని రక్త-మాంసాది సప్త్ధాతువులు పరిపుష్టం కాకుండ యుండటంవలన మరియు మనోబుద్ధులు విద్యవైభవం ఇంకా పరిపూర్ణ దశకురాని కారణంగా ఆ వయస్సు వివాహానికంత యోగ్యంగా ఉండదు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు