స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక వృద్ధాప్యమందామా ‘మినాతిశ్రీయం జరిమా తనూనామ్’ అది శరీర శోభను హరించివేస్తుంది. పెండ్లిలో అందం కూడ చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. పళ్లూడిపోయి- కళ్లు కానరాక-కాళ్లు- చేతులు వణుకుతూ ఉండే వృద్ధాప్య దశలో ఉన్నవాణ్ణి ఏ యువతి ఇష్టపడుతుంది? యువతులైన స్ర్తిలు ‘అప్యూ ను పత్నీ వృషణో జగమ్ముః’ వీర్యవంతులైన పురుషులనే వాంఛిస్తారు. కాబట్టి గృహస్థ ధర్మాన్ని పాటించాలని భావించేవారు సహజమైన ఈ మానవ శరీర ధర్మాన్ని మనసున పెట్టుకొని వన వయస్సులో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి. ఈ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మనుధర్మ శాస్తక్రర్త-
వేదా నధీత్య వేదౌ వా వేదం వాపి యథాక్రమమ్‌
అవిప్లుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమ మావిశేత్‌॥ మను.్ధ.శా.3-2॥
‘‘నాలుగు గాని మూడు గాని రెండు గాని ఒకటి గాని వేదాలను క్రమానుసారం పఠించి అస్థలిత బ్రహ్మచారియై గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి’’ అని శాసించాడు.
వేదమీ మంత్రంలో ‘వృషణః’ వీర్యసేచన సమర్థుడని చెప్పగా మనువు ‘అవిప్లుత బ్రహ్మచర్యః’ అస్థలిత బ్రహ్మచారి అని పేర్కొంది. అయినా రెండింటి భావమూ ఒకటే. శీఘ్రస్ఖలితుడయిన బ్రహ్మచారి శరీరశోభ ముసలితనం రాకున్నా నశించిపోతుంది. అస్ఖలిత బ్రహ్మచారియే వివాహానికి యోగ్యుడు గాని వృద్ధుడు వ్యభిచారి మాత్రం కాదు. ఈ విషయాన్ని ప్రస్తుతమంత్రం చాల రమణీయంగా చెప్పింది. వివాహానికి జ్ఞాన పరిపక్వత ముఖ్యం. బాలుని యందీ లక్షణముండదు కాబట్టి అతడు వివాహానికి అయోగ్యుడు. వృద్ధుడిలో జ్ఞాన పరిపక్వత ఉన్నా ‘మినాతి శ్రీయం జరిమా తనూనామ్’ ముసలితనం చేత ఆతడి శరీరకాంతి- శక్తి విహీనమైపోతుంది కాబట్టి అతడు కూడ పెండ్లికనర్హుడే. కాబట్టి పెండ్లి కన్నిరీతుల యోగ్యుడు కేవలం వనవంతడు మాత్రమే. అట్టివానినే బ్రహ్మచారిణులు తమ పతిగా ఇష్టపడతారని - బ్రహ్మచర్యేణ కన్యా యువానం విందతే పతిమ్‌॥ అథర్వణవేదం 11-5-18॥ అథర్వణ వేదం ధ్రువీకరించింది.

దైవం దాహార్తులకు
మధురజలం... ఆనందప్రదుడు
యథా పూర్వేభ్యో జరితృభ్య ఇంద్ర మయఇవాపో న తృష్యతే బధూథ
తామను త్వా నివిదం జోహవీమి విద్యామేషం వృజినం జీవదానుమ్ ॥

భావం:- ఓ ఇంద్రా! దాహార్తులకు నీరు సంతోషం కలిగించే విధంగా నిన్ను సన్నుతి చేసిన పూర్వులైన వారికి సంతోషాన్ని కల్గించి యుంటివి. నేను వారి భక్త్భివానుగుణంగా నిన్ను పలుమార్లు సంస్తుతి చేస్తున్నాను. దానివలన నేను అన్నాన్ని- బలాన్ని పొందగలను. అట్లే పాప నివారణ సమర్థమై జీవన ప్రదాయిని అయిన జ్ఞానాన్ని కూడ పొందగలను.
వివరణ:- దాహం జీవుల్ని సదా బాధిస్తుంది. నీరు లభించగానే దాహార్తి తీరి వారికి సుఖం కల్గుతుంది. దాహార్తికి నీరే అమృతం. అతడికి వస్త్రాలిచ్చినా- భోజనం పెట్టినా వాటిని స్వీకరించడు. నిజానికి ఆ అన్న వస్త్రాలు ఎంతో ముఖ్యమైన వయినా అవి దాహాన్ని తీర్చలేవు. కాబట్టి దాహం వేసిన వాడికి అవి సుఖకరమైనవి కావు. దాహంతో నాలుక ఎండిపోతుంటే రిచావు దగ్గరపడినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి రెండు మూడు నీటి చుక్కలు నాలుకపై వేస్తే మూసుకొన్న కళ్లు తెరుచుకొంటాయి. పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. అందుకే సంస్కృత భాషలో నీటికి జీవనమని అమృతమని పేరు. ‘జలం జీవనముచ్యతే’ అన్నది పెద్దల మాట. అమరకోశం కూడ ‘కీలాల మమృతం పయః’అని నీటికి పర్యాయ పదాలుగా కీలాల, అమృత పదాలను పేర్కొంది.
ఇదే విధంగా రిసంసారతాపం చేత వాడిన మరియు అలసిపోయిన ఆత్మకు పరమాత్ముడు ‘మయ ఇవాపో న తృష్యతే బభూథ’ దాహార్తికి జలం వలె సుఖకారకుడవుతున్నాడు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు