స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఆయన నీట కంటె కూడ అధికంగా పరిశుద్ధుణ్ణి మరయు సర్వబాధలనుండి విముక్తుణ్ణి చేసిన పరమశాంతుణ్ణి చేస్తాడు. అయితే ఆ సంసారార్తుడు తనను ప్రశాంత పరచిన భగవానుని చేరుకొనే జ్ఞానం లేనివాడై ఇలా ప్రార్థిస్తాడు. ఓ ప్రభూ! ఎందరో సంసారార్తుల కష్టాలను నివారించావు. ప్రశాంతిని ప్రసాదించావు. వారే విధంగా భక్త్భివంతో నిన్ను ప్రార్థించి పిలిచారో అదే రీతిగా నేను కూడ ‘తమాను త్వా నివిదం జోహవీమి’ భక్త్భివంతో ప్రార్థిస్తూ పిలుస్తున్నాను.’’ నేను సంసారవ్యాకులుడను. నాకు శాంతిని ప్రసాదించు. ఓ శాంతిధామా పూర్వులైన వారికెట్టి సుఖశాంతులను అనుగ్రహించావో నాకునూ అనుగ్రహించు.
ఓ ప్రభూ! నేను ఒంటరివాడను గాను. నా కొఱకు మాత్రమే నిన్ను అర్ధించడం లేదు.
ఈ లోకమంతా దాహార్తమై యుండటాన్ని నేను చూస్తున్నాను. జీవన విజ్ఞానమెట్టిదో తెలియని అజ్ఞానులమై యున్నాం. నీవు మాకు జీవన ధనుడవు. అందరకు జీవన దానమిచ్చేవాడవు. నేను నా సంసార దాహార్తిని తీర్చుకొని జీవితానందాన్ని కోరుకోవడంలేదు. అందరి కొఱకు జీవన దానాన్ని- జీవన జ్ఞానాన్ని అర్థిస్తున్నాను. మాకవి ప్రసాదించు. నీవు సృజించిన ప్రజలు సంసారార్తులై మృత్యుముఖులగుచున్నారు. మేము వారికి నీవు ప్రసాదించిన జీవన విజ్ఞానాన్ని అందచేస్తాం. ముందుగా సంసారార్తులమై నిర్జీవులమై యున్న నాకు జీవన విజ్ఞానాన్ని అనుగ్రహించు.
***
భగవానుడు మహాకర్మనిష్ఠుడు
అయం దేవానామపసామపస్తమో యో జజాన రోదసీ విశ్వశంభువా
వి యో మమే రజసీ సుక్రతూయయాజరేభిః స్కంభనేభిః సమానృచే॥
ఋ.1-160-4॥
భావం:- ఏ దైవం సర్వజీవులకు శాంతిదాయకమైన భూమ్యాకాశాలను సృజించాడో, ఏ భగవానుడు తన బుద్ధివైభవం చేత క్రియాకౌశలం చేత ఊర్ధ్వ అధో లోకాలను ఎన్నడూ నశించని- నిరోధింపబడని విశిష్ట శక్తివంతంగా సృజించాడో, ఆ దైవం నిరంతర కర్మశీలుడు. సమస్త దేవతలలో అత్యంత ప్రతిభావంతుడైన క్రియావంతుడు.
వివరణ:- దైవం నిరంతర క్రియాశీలుడని వేదం ప్రతిపాదించడమే కాదు దానికి తగిన ఆధారాలను గూడ చూపుతుంది. భగవానుడేమీ చేయని నిష్క్రియాపరుడే అయితే ఆయన ఉండినా లేకున్నా ఒకటే. అసలు ఏమీ చేయని పరమాత్ముని అస్తిత్వానికి ప్రమాణం మాత్రమెక్కడుంటుంది? అట్టి దైవముందని భావించినందువల్ల లాభమేమిటి? కేవలం ఉపాసించేందుకే దైవాన్ని అంగీకరించాలని చెబితే అది కూడ సరికాదు. ఎందుకంటె- ఉపాస్యదైవం నుండి ఏదో ఒక ఆధ్యాత్మిక ఫలాన్ని పొందడమే కదా ఉపాసనకు పరమ లక్ష్యం.
నిష్క్రియుడైన దైవాన్ని గురించి చేసే ఉపాసన కూడ నిష్క్రియతో సమానమే కదా. నిష్క్రియాపరుడయిన దైవం ప్రత్యేకంగా ఇచ్చేది మాత్రమేముంటుంది. ఈయడానికి ముందతడు క్రియాశీలుడై యుండాలి. కాని వేదమేమంటోందంటే ఆ పరమేశ్వరుడు ‘‘దేవానా మపసాసామప స్తమః’’ ‘‘స్వయంగా క్రియాశీలుడు కావడమే కాదు సమస్త దేవతల కంటె మహోన్నత క్రియాశీలుడు’’ అని వక్కాణిస్తుంది. సూర్యుడు- చంద్రుడు - అగ్ని- వాయువు - జలం మొదలైన దేవతలందరు నిత్యక్రియాశీలురే. సూర్యుడే తాను చేసే పనిని విరమిస్తే తక్కిన చంద్రాగ్న్యాదులు కూడ నిష్క్రియాపరమై పోతాయి. నీటిలో రసత్వమే నశిస్తే అప్పుడది పానయోగ్యమై కాదు. ఈ అన్నింటి యందున్న క్రియాశక్తులన్నివాటికి సహజమైనవి కావు. అవన్ని దైవకృపాదానాలే. ఎప్పుడయినా ఇవి తమ శక్తుల్ని కోల్పోవచ్చు. జీవులు అలసిపోయి క్రియాహీనమై పోవడం అందరూ చూస్తున్నదే. ఏదో ఒకనాడని తమ స్వరూపాలనే విడిచిపెడతాయి. అసలు జగత్తే ఒకనాడు ప్రళయంలో నశిస్తుంది.

ఇంకావుంది...