స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

భక్తులకు, జ్ఞానులకు దైవమే శరణ్యుడని వేదం ఈ మంత్రం ద్వారా అద్భుతంగా ప్రతిపాదిస్తూంది. భక్తుడు కేవలం తన కొరకేదీ కోరుకోడు. అందరికి శుభం కలగాలని మాత్రమే కోరుకొంటాడు. అందరను తన మార్గంలో నడిచేవారిగా చేస్తాడు. ఇక వేదాల సమస్త సారాన్ని తెలిసికొన్న జ్ఞాని కేవలం వేదాల ఎడల అభిమానిగా మాత్రమే ఉండడు. అంతేకాదు తానొక్కడే వేద విజ్ఞాన ఖనిగా ఉండేందుకు కిష్టపడడు. తనతోబాటు అందరూ వేద విజ్ఞానవంతులు కావాలని సత్సంకల్పంతో వేదజ్ఞానాన్ని ప్రబోధిస్తాడు.
భవగంతుని అనన్య భావంతో చేసే ఆరాధన యందే భక్తికి సాఫల్యం. అలాగే జ్ఞానానికి అంతిమంగా జ్ఞేయమైన (తెలుసుకోదగినది) దేదియుందో దానిని సంపూర్ణంగా తెలుసుకోవడంలోనే సాఫల్యముంది. అలా కాకుంటే ‘తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాం రతాః’- ప్రకృతినా ఆరాధించేవారు ప్రవేశించే గాఢాంధకారం కంటె మించిన అంధకారమూ అనిపించే అంధకారంలో విద్యయం దత్యంతాసక్తి కల్గినవారు కూరుకుపోతారు (వివరణకు ఈశావాస్యోపనిషత్తును చదవండి) అని శుక్ల యజుర్వేదం స్పష్టం చేస్తూంది. అందుకే ఈ మంత్రం దేవా! భక్తులు, జ్ఞానులు కూడా నినే్న ఆశ్రయిస్తున్నారు. ‘ఉభయాసో జాతవేదః స్యామ తే స్తోతారో అగ్నే సూరయశ్చ శర్మణి’ అని నిస్సందేహంగా పేర్కొంది.
భగవంతుడు మానవులకే కాదు సర్వజీవులకు సుఖదాయకుడు. అందరూ ఆయన అనుగ్రహించినదే అనుభవిస్తూ ఉన్నారు అని ఋగ్వేదమే ‘త్వయా మర్తాసః సద్వంత ఆసుతిమ్’- మరణశీలురైన జీవులు నీ కారణంగానే ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారని వేరొక సందర్భంలో వివరించింది. ఈ సత్యాన్ని గ్రహించిన జ్ఞానులు గోర్భూమ్యాది ధనసంపదలను భక్తులైనవారికి సంతోషంగా దానం చేస్తారు. ‘యే స్తోతృభ్యో గోఅగ్రామశ్వపేశసమగ్నే రాతి ముపసృంజతి సూరయః- అని జ్ఞానుల ప్రవృత్తిని వర్ణించింది.
స్వయంగా కోరుకొనకపోయినా అట్టిజ్ఞానులకు విశేషధనం సమకూరుతుంది. ధనం ప్రధానంగా అందరకు ఆశ్రయమిచ్చే సద్గుణం కల్గింది కావాలి. విధ్వంసం చేయడం దాని గుణం కారాదు. ‘్ధనం పురశ్చంద్ర’= అందరకానందం కలిగించేదిగానే ఉండాలి. సాధారణంగా ధనవంతులు సంతాన హీనులుగా ఉంటారు. కాని భక్తులు - జ్ఞానులు అయినవారి సంతానం గొప్ప ధనవంతులే అవుతారు. ఎందుకంటే పరమేశ్వరుడే ‘రయిర్బహులో విశ్వతస్పృథుః- సర్వవిధాలా పెన్నిధి అని ఋగ్వేదమే వివిధ సందర్భాలలో పేర్కొంది. ‘ఎవడు స్వయంగా ధనవంతుడో, ‘నజరే మిహర’ ఎవని దృష్టిలో ‘జర’ = సర్వధన నిధులున్నాయో’’ అట్టి భగవంతుని శరణుజొచ్చినవానికి ధనానికి నివాసానికి లోటేమి యుంటుంది? కాబట్టి ఓ మానవులారా! ధనమే కోరుకొంటే మీరు రయిపతి = ధనపతి అయిన దైవాన్ని ఆశ్రయించండి. జీవనవాంఛ కూడా ఆయన సన్నిధిలోనే సఫలమవుతుంది. సమస్త ఆశలు - ప్రతిఫలాపేక్షలకు ఆ దైవమే కేంద్ర స్థానం.

వాఙ్మనః కాయ ధనాలతో యజ్ఞం చేయి

యజ్ఞేన వర్థత జాతవేదసమగ్నిం యజధ్వం హవిషా తనా గిరా
సమిధానం సుఅపయసం స్వర్ణరం ద్యుక్షం హోతారం వృజనేషు ధూర్షదమ్
భావం: జ్ఞాన స్వరూపుడైన అగ్నిని ఆరాధించి వృద్ధిపరచము. హవిస్సు, ధనము, శరీరం, సంతానం వాక్కుల చేత మహోజ్వలంగా ప్రకాశించే ఉత్తమ సాధకుడయిన తోటి మానవులకు సుఖదాతయై, పాపాలను భయపెట్టి దూరంగా ఉంచేవానిని, మహాదానశీలిని అర్చించుము.

ఇంకావుంది...