రాష్ట్రీయం

స్వామి పరిపూర్ణానంద తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరం నుంచి స్వామి పరిపూర్ణానందను తరలించారు. ఆయనను ఆర్నెళ్ల పాటు నగరం నుంచి డీజీపీ బహిష్కరించిన విషయం విదితమే. గత ఏడాది నవంబర్‌లో జరిగిన హిందూసేన సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ నగరం నుంచి బహిష్కరించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా రామాయణంలోని రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ఆయనను గృహనిర్బంధంలో ఉంచిన విషయం విదితమే. తదనంతరం ఆయనను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.