జాతీయ వార్తలు

పీవీ హయాంలోనే జడ్ కేటగిరీ భద్రత కల్పించారు: స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఎన్డీఏ ప్రభుత్వం తనకు జడ్ కేటగిరీ భద్రతను కొనసాగించడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శనివారం తీవ్రంగా స్పందించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించారని, అయితే ఆ తర్వాత యుపిఏ ప్రభుత్వం దాన్ని కుదించిందని ఆయన చెప్పారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనకు జడ్ కేటగిరీ భధ్రత కల్పించిందని చెప్పారు. అయితే ఆ తర్వాత యుపిఏ ప్రభుత్వం దాన్ని కుదించి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్తించేలా చేసిందని కూడా ఆయన చెప్పారు. అయితే తమ ప్రభుత్వం (బిజెపి ప్రభుత్వం) వచ్చిన తర్వాత ఇది అన్యాయమని భావించి తిరిగి పీవీ హయాంలో కల్పించిన భద్రతను పునరుద్ధరించిందని ఆయన చెప్పారు. పీవీ నరసింహారావు బిజెపి మనిషని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నారో ఏమో తనకు తెలియదని ఆయన అన్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కోర్టుకు హాజరయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రదర్శనలు, కార్యకర్తలను సమీకరించడం అంతా చూస్తే తాము కేసు ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందనే విషయం స్పష్టమవుతోందని ఈ కేసులో పిటిషనర్ కూడా అయిన సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.
(చిత్రం)కోర్టు బయటకు వస్తున్న బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి