ప్రకాశం

రైతు పక్షపాతి చంద్రబాబునాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎమ్మెల్యే డిబివిఎస్ స్వామి స్పష్టం
జరుగుమల్లి, డిసెంబర్ 25: రైతుబిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని కొండపి ఎమ్మెల్యే డిబివిఎస్ స్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దావగూడూరు గ్రామంలో దీపం పధకం కింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గ్రామంలో ఉన్న చెన్నకేశవస్వామి ఆలయంలో ఎమ్మెల్యే స్వామి ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం గ్యాస్ పంపిణీ కార్యక్రమం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కె యానాదిచౌదరి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ 18నెలల కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యం అన్నారు. పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఉండి పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. టిడిపి సంక్షేమ పధకాలు పేదలకు వరం అని ఎమ్మెల్యే స్వామి తెలిపారు. అనంతరం 34మంది లబ్థిదారులకు గ్యాస్ కనెక్షన్లు ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది. ఈ గ్రామంలో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్ సిహెచ్ బ్రహ్మేంద్రకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పి కోటేశ్వరరావు, సుబ్బారావు, నరాల సోమయ్య, ఏ రమణయ్య, కె వెంకటేశ్వర్లు, వై కిరణ్, వి శివాజి పాల్గొన్నారు.

ఆసక్తికరంగా వాలీబాల్ పోటీలు
చీరాల, డిసెంబర్ 25: పలగాని రంగారెడ్డి మెమోరియల్ నాలుగు జిల్లాల వాలీబాల్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. అందులో భాగంగా రెండోరోజు శుక్రవారం 5 మ్యాచ్‌లు జరిగాయి. బాపట్ల పివిఆర్ క్లబ్, బేతపూడి జట్ల మధ్యం జరిగిన మ్యాచ్ పోటాపోటీగా సాగింది. బోయినవారిపాలేనికి చెందిన కొమ్మనబోయిన వెంకయ్య మెమోరియల్ జట్టు, రంగారెడ్డి నగర్ జట్లు తలపడ్డాయి. హైదరాబాదుకి చెందిన ఆర్మీ యూత్, చీరాలకు చెందిన మునికృష్ణారెడ్డి జట్లు లీగ్ దశకు చేరుకున్నాయి. పోటీల ఏర్పాట్లను నిర్వాహకులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. ఫైనల్ పోటీలు శనివారం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వారు తెలిపారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యతీసుకోవాలి
* ముస్లింల భారీ ర్యాలీ
మార్కాపురం , డిసెంబర్ 25: మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ముస్లింలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ పరమత సహనం లేని వర్గ విభేదాలు, మతద్వేషాలు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశంలో జాతీయతా భావాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహ్మాద్‌ప్రవక్తపై నిందలు మోపితే ముస్లింలు సహించరన్నారు. భారత ప్రభుత్వం ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కె చంద్రశేఖరరావుకు అందచేశారు.