జాతీయ వార్తలు

పుణ్యక్షేత్రాల అపవిత్రం వల్లే వరదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్: హనీమూన్ పేరిట కొత్తగా పెళ్లయిన వారు పుణ్యక్షేత్రాలకు వస్తూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే వరదలు సంభవిస్తున్నాయని ద్వారకా శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, 2013లో కేదారినాథ్‌లో వరదలకు ఈ అపవిత్ర పనులే కారణమన్నారు. హనీమూన్లకు, విహార యాత్రలకు వచ్చే వారు పుణ్యక్షేత్రాల వద్ద హద్దుమీరి వ్యవహరిస్తూ వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు కారకులవుతున్నారని ఆయన అన్నారు. పవిత్ర క్షేత్రాలను ఈ అనైతిక పనుల నుంచి కాపాడుకోవాలన్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అనైతిక పనులు ఆపకపోతే వరదలు పదే పదే వస్తాయని ఆయన హెచ్చరించారు.