జాతీయ వార్తలు

స్ర్తిలకు స్వేచ్ఛ ఇవ్వని ఇతర మతాలపై చర్యలు లేవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: మైనారిటీల ఓట్ల కోసం హిందువులకు అన్యాయం చేయడం తగదని ద్వారకా శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇతర మతాల్లో స్ర్తిల పట్ల కొనసాగుతున్న వివక్షను వారు ఎందుకు ప్రశ్నించరని ఆయన నిలదీశారు. మన దేశంలో ఒకానొక మతానికి చెందిన మహిళల ముఖాలు కనిపించనీయకుండా ఆంక్షలున్నాయని, ప్రార్ధనా మందిరాల్లోకి వారిని అనుమతించరని, ఆ మతానికి సంబంధించి కోర్టులు ఆదేశాలు జారీ చేయగలావా? అని ఆయన ప్రశ్నించారు. గర్భధారం, రుతుక్రమం వంటి అంశాల వల్ల హిందూ ఆలయాల్లో మహిళలను అనుమతించరని ఆయన గుర్తు చేశారు. దేశంలో అన్ని మతాల వారికీ ఒకేలా చట్టాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.