ఆంధ్రప్రదేశ్‌

గిరిజన తండాల్లో హిందూ దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వరూపానందేంద్ర సరస్వతి
సింహాచలం, మార్చి 14: గిరిజన ప్రాంతాల్లో అన్యమత ప్రచారం, మతమార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు గిరిజన తండాల్లో హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టనున్నట్టు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. ఈ ఆలయాల్లో గిరిజనులే పూజారులుగా ఉంటారన్నారు. సింహాచలంలో కొలువైన శ్రీ సత్తెమ్మతల్లి అమ్మవారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామీజీ విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో హిందూమతాన్ని ప్రోత్సహించేందుకు శారదాపీఠం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గిరిజనుల కోరిక మేరకు అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి సంబంధించి పంచాయతీల్లో తీర్మానాలు చేయించామన్నారు. పంచాయతీలు చేసిన తీర్మానాలను శారదాపీఠం ధర్మాధికారి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశామన్నారు. టిటిడి సహకారంతో 16 దేవాలయాల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఇటీవల పీఠాన్ని సందర్శించిన దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు దృష్టికి ఈ విషయం తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ పరంగా మరో 11 ఆలయాలు నిర్మించేందుకు ప్రతిపాదించగా దానికి మంత్రి అంగీకారం తెలిపారన్నారు.