రాష్ట్రీయం

స్వచ్ఛ్భారత్‌కు జిల్లా కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర్వులు జారీ చేసిన ఏపి ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛ్భారత్ మిషన్ పథకం అమలు, పర్యవేక్షణ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. కాగా జిల్లా స్థాయి కమిటీలను తాజాగా ప్రకటించింది. జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యుడు, వైస్ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు, సభ్యులుగా మిగిలిన ఎంపిలు, ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నగరాల్లో అయితే మేయర్, పట్టణాల నుంచి మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ఆ జిల్లాలో పేరొందిన స్వచ్ఛంధ సంస్థ, విద్య, సమాచార రంగాల నుంచి ఒక్కొక్కరు ఉంటారని ప్రభుత్వం జివోలో తెలిపింది. సభ్యకార్యదర్శిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని తెలిపింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరక్టర్ ఈ మేరకు జివో అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందుకు కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా కమిటీ సమావేశమై స్వచ్ఛ్భారత్ మిషన్ అమలుకు సంబంధించి పూర్తిగా సమీక్షించాలని, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని తెలిపింది. ఆ ప్రకారం 30 రోజుల్లో ఆయా అంశాలపై ప్రభుత్వం స్పందించ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. నిధులు మంజూరు చేయించుకోవడం, వాటిని సరైన పద్దతిలో ఖర్చు చేయించడం, జరిగిన, జరుగుతున్న పనులను పర్యవేక్షించడం, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం జివోలో పేర్కొంది. మరికొన్ని మార్గదర్శకాలతో పాటు ఏ జిల్లాకు ఎవరు ఉండాలనేది నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి చైర్మన్, కో చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురం జిల్లాకు చైర్మన్‌గా నిమ్మల కిష్టప్ప, కో చైర్మన్‌గా జెసి దివాకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు చైర్మన్‌గా డాక్టర్ ఎన్.శివప్రసాద్, కోచైర్మన్లుగా మిధున్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాకు మాగంటి మురళీమోహన్, కో చైర్మన్‌గా తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, కొత్తపల్లి గీత, గుంటూరు జిల్లాకు చైర్మన్‌గా రాయపాటి సాంబశివరావు, కోచైర్మన్లుగా జయదేవ్ గల్లా, శ్రీరాం మాల్యాద్రి, కడప జిల్లాకు వైఎస్ అవినాష్‌రెడ్డి చైర్మన్‌గా, కో చైర్మన్‌గా మిధున్‌రెడ్డి, కృష్ణా జిల్లాకు చైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావు, కో చైర్మన్లుగా కేశినేని శ్రీనివాస్, మాగంటి వెంకటేశ్వరరావు, కర్నూలుకు చైర్మన్‌గా ఎస్‌పివై రెడ్డి, కో చైర్మన్‌గా రేణుక బుట్టా, నెల్లూరుకు చైర్మన్‌గా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కో చైర్మన్‌గా డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు, ప్రకాశం జిల్లాకు చైర్మన్‌గా యర్రం వెంకటసుబ్బారెడ్డి, కో చైర్మన్లుగా శ్రీరాం మాల్యాద్రి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు, కో చైర్మన్లుగా కింజరపు రామ్మోహన్‌నాయుడు, కొత్తపల్లి గీత, విశాఖపట్నంకు చైర్‌పర్సన్‌గా కొత్తపల్లి గీత, కో చైర్మన్లుగా అవంతీ శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు, విజయనగరం జిల్లాకు చైర్మన్‌గా అశోక్‌గజపతి రాజు, కోచైర్మన్లుగా కంభంపాటి హరిబాబు, కొత్తపల్లి గీత, పశ్చిమగోదావరి జిల్లాకు చైర్మన్‌గా మాగంటి వెంకటేశ్వరరావు, కో చైర్మన్‌గా గోకరాజు గంగరాజు, మాగంటి మురళీమోహన్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.