సబ్ ఫీచర్

సమస్య మూలాల్లోకి వెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయిన సంవత్సరం అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీగారి ఉపన్యాసం అనటం కన్నా ‘స్వచ్ఛ భారత’ పిలుపు దూరదర్శినిలో చూస్తూ వినటం జరిగింది. ఎప్పటిలాగానే ఆయన ఉపన్యాస వైఖరి అందర్నీ మంత్ర ముగ్ధులను చేసింది. ఇది జరిగి సంవత్సరం దాటిపోయినా అప్పుడప్పుడు వేడుకగా స్వచ్ఛ్భారత్ నిర్వహణ ప్రభుత్వం వారు పెద్దపెద్ద ఉద్యోగస్తులూ అధికారులు నిర్వహిస్తున్నట్టు పత్రికలలో ఫొటోలు చూడటమే గాని వాస్తవంగా దేశ పరిస్థితులలో మార్పేమీ కనపడటం లేదు. అసలు విషయానికి వస్తే ఇంతగా నాగరికత పెరిగిపోయిందనుకుంటున్న సమయంలో ఇల్లు, పరిసరాలు, తద్వారా సమాజ పరిసరాలు, దేశం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పవలసి రావటం కన్నా దురదృష్టం ఏముంటుంది? గాంధీగారు 80 ఏళ్ళకు పూర్వం చెప్పినవే మళ్ళీ ప్రధానమంత్రిగారు పునరుద్ఘాటించారు.లేదా అంటే ఆ మహానుభావుడు తను సఫాయి చేస్తుంటే తనను అందరు అనుసరిస్తారని ఊహించారు. కాని ఆరోజుల్లోనే ఆ పని ఆయనకు, ఆయనతో ఉండే స్వచ్ఛంద పరివారానికే పరిమితమై ఆయనతోపాటే మాయమయింది. ప్రధానమంత్రిగారు అలా కాకుండా దేశంలోని ప్రజలందరు, ప్రభుత్వం, సకల జనము స్వచ్ఛందంగా పూనుకుని మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాలలో శాశ్వతంగా పాలుపంచుకోవాలని, అప్పుడే మహాత్ముని ఆత్మశాంతిస్తుందన్నట్టు చెప్పారు. 60, 70 సంవత్సరాలకు పూర్వము మన దేశం శతాబ్దాలుగా పరాయిపాలనలో ఉన్నదని, చాలా బీద దశలోఉందని, అందుకే పరిశుభ్రత పాటించలేకపోయారేమోనని ఒక కుంటి సాకు. పరాయి పాలన, బీదరికానికి, ఎవరికి వారు తాము తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోలేకపోవటానికి ఉన్న సంబంధమేమిటో అర్థంకాదు.
మనదైన సనాతన ధర్మంలో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. బాహ్య పరిశుభ్రతతోపాటు అంతరంగ శుచిని కూడ విపులంగా చెప్పారు. అందుకే ఏ పూజలోనైనా ‘బాహ్యాంభ్యాంతర శుచి’అని చదువుతారు. ప్రస్తుతం బాహ్యానికే లేని శుచి ఆంతర్యంలో ఊహించను కూడలేము. ఒకప్పుడు గృహస్థులంతా ఉదయం సాయంత్రం ఇంటి ముందర వెనక ఊడ్చి కళాపిచల్లి ముగ్గులు పెట్టి అలంకరించుకునేవారు. ఇంటి చుట్టూ కూడ ఎప్పుడూ కళకళలాడే పూల చెట్లు, పండ్ల చెట్లతో, పక్షుల కిలకిలా రావాలతో, ఉడతల పరుగులు, సీతాకోక చిలుకల కవ్వింపులతో ఎంతో పరిశుభ్రంగాను మంగళప్రదంగాను ఉండేది. చివరకు పశువుల పాకలు గూడ పొద్దునే్న పేడతీసి ఊడిచిన తరువాతే పాలు తీసుకునేవారు. ఇంట్లో చాలావరకు అందరూ సూర్యోదయానికి ముందే లేచి తలా ఒక పనిచేసుకుని పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకునేవారు. తాము చేయలేని పనులకు మాత్రమే నౌకర్లమీద ఆధారపడటం ఉండేది. ఇప్పుడు నాగరికత ముదిరి ఇంటి యజమాని, యజమానురాలు పొద్దున 8 గంటలకు, పిల్లలు 11 గంటలకు లేస్తున్నారు. వారి వారి పరీక్షలో, ఆఫీసులో ఉంటే కాస్త ముందుగా లేచి ఆదరాబాదరాగా తయారై ఏదో ఒకటి ఇంత నోట్లో కుక్కుకునో డబ్బాలో పెట్టుకునో పరిగెడతారనుకోండి. దాంతో పరిసరాల పరిశుభ్రత అనేది జీతం తీసుకుని పనిచేసే వారి బాధ్యతగా మారింది. వాళ్ళ జీతం వాళ్ళకొస్తుంటే శ్రద్ధగా పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలని వాళ్ళకెందుకుంటుంది. అదీకాక వాళ్ళు చేశారా లేదా అని అజమాయిషీ చేసి చూసే సమయం కూడ యజమానుల కుండటం లేదు. ఇక ప్రజాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు వీధులు శుభ్రంగా ఉంచాలని ఎవరనుకుంటారు? ఎవరికి పుట్టిన బిడ్డకోసం వాళ్ళే ఏడవలేకపోతున్నారు కదా!
ఇంకో ముఖ్య విషయం. ఏదైతే ప్రపంచమంతా, దాంతోపాటు మనమూ, అభివృద్ధిపథంలో ఉన్నామని అనుకుంటున్నామో దాంతో సిద్ధమవుతున్న చెత్త వేస్టేజ్‌ను నిర్మూలించటం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. అభివృద్ధి చెందామనుకుంటున్న పాశ్చాత్య దేశాలవారు తమ చెత్తతో సముద్రంలోనో బీద దేశాల పరిసరాలలోనో ముంచెత్తుతున్నారు. మన ఇంట్లో చెత్త ఊడ్చి పక్కవాళ్ళ ఇంటిముందర వేసినట్టనుకోవచ్చు. ప్రతి వస్తువును ప్యాకేజింగ్‌కు ఎంతెంత సామాను వాడుతున్నారు. అందులో 90 శాతం ప్లాస్టిక్కు, సింథటిక్కులే. సృష్టిలోని ప్రతి వస్తువునూ చివరగా తనలో లీనం చేసుకుంటున్న భూమాత, దేన్నైనా దహించగలిగిన అగ్నిదేవుడు ఎంత కాలానికి డిస్‌కంపోజ్ కాని ప్లాస్టిక్కు, సింథటిక్కు పదార్థాలను ఏమీ చేయలేక విఫలులైపోయి, వెర్రిచూపులు చూస్తున్నారనిపిస్తోంది. ఒకప్పుడు సరుకులకు వెళితే గుడ్డదో, నారదో సంచులు తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు షాపులవాళ్ళే ఏదో ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి ఇస్తున్నారు. చివరకు బియ్యం బస్తాల దగ్గర్నుంచి ప్లాస్టిక్కువే. మనకు స్వాతంత్య్రం వచ్చాక హక్కులు కోరటమే గాని బాధ్యత నిర్వర్తించటం మర్చిపోయామనిపిస్తుంది.
చివరగా ఏ సమస్యకైనా దాని మూలాల్లోకి వెళ్తేకాని శాశ్వత పరిష్కారం జరగదు. అభివృద్ధి అనుకుంటూ ఇంత విలాసవంతమైన జీవన విధానంతోనే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. మన ప్రధానిగారు సమస్యను ఈ కోణంలోనుంచి ఆలోచించటం లేదనిపిస్తుంది. అందరమూ నిరాడంబరమైన జీవన విధానం అవలంబించి అవసరం మేరకే వస్తువినియోగం చేసుకుంటే ప్రకృతి వనరుల సంరక్షణ, పరిశుభ్రత, వాతావరణ కాలుష్య నివారణ అన్నీ వాటంతటవే చేకూర్తాయనిపిస్తుంది.

- కౌస్త్ భ