జాతీయ వార్తలు

స్వాతి హత్యకేసు చెన్నై పోలీసులకు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఇక్కడి సుగంబాకం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకు సంబంధించి చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతిని సాధించలేక పోవడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సుగంబాకం రైల్వే స్టేషన్‌లో ఓ ఆగంతకుడు స్వాతిని వేట కొడవలితో నరికి చంపాడు. రైల్వే స్టేషన్ బయట లభించిన సిసి ఫుటేజీ ఆధారంగా హంతకుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించి కొన్ని ఊహాచిత్రాలను విడుదల చేశారు. కాగా, డిఎంకె శాసనసభాపక్షం నేత స్టాలిన్ స్వాతి కుటుంబ సభ్యులను సోమవారం నాడు పరామర్శించారు. మహిళలకు భద్రత కల్పించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.