జాతీయ వార్తలు

అంతా ప్రేక్షకుల్లా చూశారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ‘నా కుమార్తెను ఓ ఆగంతకుడు కత్తితో నరికి చంపుతుండగా అక్కడున్న వారంతా చోద్యం చూసినట్లు వౌనం వహించారు.. అంతా ప్రేక్షకుల్లా ఉండిపోయారే తప్ప ఆమెను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.. ఒక్కరు స్పందించి అడ్డుకున్నా నా కుమార్తె బతికి ఉండేదేమో..’- అని సుగంబాకం రైల్వే స్టేషన్‌లో హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి తండ్రి గోపాలకృష్ణన్ ఆవేదనతో అన్నారు. గత శుక్రవారం స్వాతిని ఓ ఆగంతకుడు పట్టపగలు చెన్నైలోని సుగంబాకం రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే హత్యచేసి నడుచుకుంటూ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. స్వాతి మరణించిన అయిదురోజుల తర్వాత ఆమె తండ్రి తొలిసారిగా మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. గంటకు పైబడి స్వాతి మృతదేహం అలాగే ప్లాట్‌ఫాంపై పడి ఉందని, ఆలస్యం కావడంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కూడా వీలు లేకుండా పోయిందన్నారు. అవయవ దానం జరిగి ఉంటే- వాటిని అమర్చిన వారిలో తన కుమార్తెను చూసుకునే అవకాశం కలిగి ఉండేదన్నారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, హంతకుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.