జాతీయ వార్తలు

స్వాతి హత్యకేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో అనుమానితుడైన రామ్‌కుమార్ (24)ను చెన్నై పోలీసులు తిరునెల్వేలిలో ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసులను చూడగానే బ్లేడుతో గొంతుకోసుకుని నిందితుడు ఆత్మహత్యకు యత్నించి గాయపడడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు కోలుకున్న తర్వాత పోలీసులు విచారణ జరిపితే హత్యకు దారితీసిన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గత నెల 24న నుగంబాక్కం రైల్వే స్టేషన్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగానే స్వాతిని ఓ ఆగంతకుడు కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. సమీపంలో లభించిన సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా గళ్లచొక్కా వేసుకున్న ఓ అనుమానితుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ చదివిన రామ్‌కుమార్ స్వాతి నివాసానికి సమీపంలోనే ఉంటున్నట్లు విచారణలో తేలింది. హత్య జరిగిన సమయంలో అతను గదిలో లేకపోవడం, అతని మొబైల్ నుగంబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో స్వాతి హత్యకేసును చెన్నై పోలీసులు సవాలుగా తీసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.