జాతీయ వార్తలు

కుంభకోణాలపై శే్వతపత్రం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: బిజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ పెద్దలతో వివిధ కుంభకోణాల సూత్రధారులకు బలమైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, బ్యాకింగ్ సెక్టార్‌లో గత ఐదేళ్లలో జరిగిన 61వేల కోట్ల రూపాయల కుంభకోణాలపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఒక కుంభకోణం తలుపులు మూసుకోకముందే మరో కుంభకోణం ద్వారాలు తెరుచుకుంటున్నాయి అంటూ వరుసగా వెలుగు చూస్తున్న బ్యాకింగ్ కుంభకోణాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు ఎల్‌వోయులతో పీఎన్బీలో 11.4వేల కోట్ల అవినీతికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీల కేసు ఓ పక్క నడుస్తుండగానే, మరో బ్యాంకింగ్ కుంభకోణంపై కథనాలు వెలువడుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ వెల్లడించారు. భారతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి 800 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న రొటోమేక్ పెన్నుల కంపెనీ అధిపతి విక్రమ్ కొఠారి అదృశ్యమైనట్టు కథనాలు వెలువడుతున్న వైనాన్ని తివారి ప్రస్తావించారు. ‘్భరతీయ బ్యాంకుల్లో కుంభకోణాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకుల లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో 61,260 కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది’ అని మనీష్ స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో నాలుగేళ్ల పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తెరగాలని ఆయన అన్నారు. కుంభకోణాల సూత్రధారులు, బీజేపీ పెద్దల మధ్య సంబంధాలు సవాలక్ష ప్రశ్నలకు తావిస్తోందని, భారతీయ ఆర్థిక పరిస్థితిపై అపనమ్మకాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ‘బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్రం శే్వతపత్రం విడుదల చేయాలి’ అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అలాగే వివిధ బ్యాంకుల్లో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణాలు? వాటి స్థాయి? కుంభకోణాల సూత్రధారులు? బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల చిట్టాలను నేరుగా ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉందని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2017 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని బ్యాంకుల్లో 8,36,782 కోట్ల రూపాయల నిరర్థక ఆస్తులు పేరుకుపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ‘77 శాతం ఎన్పీయేలు ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలకు చెందినవే’ కావడం గమనార్హమని తివారీ వెల్లడించారు. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించలేని ప్రభుత్వమే ఈ పరిస్థితికి బాధ్యత వహించాలని తివారి డిమాండ్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణం ప్రభుత్వ పారదర్శకతపై సవాలక్ష ప్రశ్నలు లేవనెత్తుతోందని తివారీ వ్యాఖ్యానించారు.