త్వరలో లిటిల్ స్టార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌డి విజన్ ఇండియా లిమిటెడ్ పతాకంపై బాల తారలతో రూపొందించిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. అహ్మద్ అఫ్ఫాన్ సమర్పణలో అనంతపురం ఫిలిమ్ సొసైటీ సహకారంతో రషీద్ బాషా దర్శకత్వంలో ఎన్.ఇబ్రహీం రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించి విజయ తీరాలను చేరిన ఆరుగురు చిన్నారుల కథాకథనంతో ఈ చిత్రం సాగుతుందని, వారు చేసే సాహసాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి, ప్రజలకు స్ఫూర్తిని ఎలా కలగజేశారో ఈ చిత్రంలో చెబుతామని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడవలసిన ఈ చిత్రంలో దృఢ సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చన్న అబ్దుల్‌కలామ్ ఆశయం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, అందుకే ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నామని తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో రిషి హీరోగా నటిస్తుండగా, నిఖిత, శ్రేష్ఠ, దివిజ, తశ్లీమ్, సోని, చరణ్, హర్ష అనే పిల్లలు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్‌సాగర్, ఎడిటింగ్: నివాస్, సంగీతం: శ్రీ వెంకట్, నిర్మాత: ఎన్.ఇబ్రహీం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రషీద్‌బాషా.