క్రీడాభూమి

భారత్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్ని : ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ-ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లో బారత్ విజయబావుటా ఎగరేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీ చివరి బంతికి భారత్ విజయాన్ని సాధించింది. తొలి రెండు పోటీల్లో నెగ్గిన భారత్ చివరి మ్యాచ్‌లోనూ ప్రతిభచూపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 198 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. కాగీ ఛేజింగ్‌కు దిగిన భారత్ ధాటీగా ఆడింది. రోహిత్ (52), కోహ్లి (50), శిఖర్‌థావన్ (26) సమయోచితంగా ఆడినా చివరివరకు ఉత్కంఠ తప్పలేదు. చివరి ఓవర్‌లో 17 పరుగులు సాధించాల్సి తరుణంలో సురేశ్ రైనా తన అనుభవాన్ని జోడించి విజయాన్ని ఖాయం చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు సాధించాల్సి ఉండగా ఫోర్ కొట్టి ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని సాధించిపెట్టాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో రైనా 49 పరుగులు చేశాడు.