టెంపర్ టీమ్ మరో సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నాన్నకుప్రేమతో’ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25నుండి ప్రారంభం కానుంది. సినిమా తర్వాత తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు ఎన్టీఆర్. గత ఏడాది పూరి జగన్నాథ్‌తో చేసిన ‘టెంపర్’ సినిమా మంచి విజయం సాధించడంతో మరోసారి పూరి జగన్నాథ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్‌ను ఈ సినిమాతో కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇటీవలే ఎన్టీఆర్‌కు కథ వినిపించాడని, కథ నచ్చడంతో తను ఓకె చెప్పినట్టు తెలిసింది. కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న పూరి ఈ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ నిర్మిస్తాడని తెలిసింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కన్నడ, తెలుగు భాషల్లో ‘రోగ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.