క్రీడాభూమి

త్వరలో జడేజా వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఫిబ్రవరి 5: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజ్‌కోట్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ రివా సోలంకిని జడేజా వివాహం చేసుకోబోతున్నాడు. రాజ్‌కోట్‌లోని కలవాద్ రోడ్డులో ఉన్న జడేజాకే చెందిన ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’ రెస్టారెంట్‌లో శుక్రవారం ఈ ఇద్దరి వివాహం నిశ్చితార్థం జరిగింది. కొద్ది మంది ఆహూతుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. రివా రాకతో అటు క్రికెట్ జీవితంతో పాటుగా ఇటు తనవ్యక్తిగత జీవితం మరింత బాగా ఉంటుందని ఆశిస్తున్నానని కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జడేజా అన్నాడు.