జాతీయ వార్తలు

తప్పు మీది.. నింద మాపైనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలీ, ఫిబ్రవరి 12: పా ర్లమెంట్ ప్రతిష్ఠంభనపై తమ పార్టీని పదేపదే ప్రధాని మోదీ విమర్శించడాన్ని కాంగ్రె స్ అధినేత్రి సోనియా గాంధీ తిప్పికొట్టారు. పేదలు, సామాన్యులకు సంబంధించిన అంశాలను సభ లో లేవనెత్తిన ప్రతిసారీ తమ పార్టీ గొంతు నొక్కేందుకు ప్ర యత్నిస్తున్నారని అన్నారు. ఈ అంశాలపై తమ పార్టీ ఎంపీలను మాట్లా డనివ్వక పోవడమే కాకుండా తప్పంతా తమదే అన్నట్టుగా ప్రచారం కూడా చేస్తున్నారని మోదీ సర్కార్‌పై సోనియా విరుచుకు పడ్డారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 అనుబంధ సంస్థల కార్యవర్గ సభ్యులనుద్దేశించి సోనియా మాట్లాడారు. మిశ్రమ సంస్కృతే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సోనియా ‘కొన్ని శక్తులు దేశ సమైక్యత, సమగ్రతలను దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నాయి’అని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ శక్తులు రాజ్యాంగ వ్యవస్థలనూ బలహీన పరుస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న హామీలన్నీ గాలిబుడగ చందమేనని, ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు.