జాతీయ వార్తలు

‘టైమ్ మిషన్’ దిశగా అడుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: వందేళ్ల క్రితం జర్మనీ సైద్ధాంతిక భౌతిక శాస్తవ్రేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ వెలుగులోకి తెచ్చిన గురుత్వాకర్షక తరంగాలు నిజమేనన్న నిర్ధారణ.. భవిష్యత్‌లో ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది? ప్రపంచ వ్యాప్తంగా ఈ గురుత్వాకర్షక తరంగాల నిర్ధారణ ఈ శతాబ్దంలోనే చారిత్రక ఆవిష్కరణ అంటూ శాస్త్ర ప్రపంచం ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకుంది. వందేళ్ల క్రితమే ఐన్‌స్టీన్ ఊహించిన సాపేక్షిక సిద్ధాంతం ఇనే్నళ్ల తరువాత వాస్తవికంగా రుజువుకావడం గతంలోకి మనిషిని తీసుకెళ్లే టైమ్ మిషన్ ఆవిష్కరణకు ఆస్కారం ఇస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే భవిష్యత్‌లో ఏ కరమై ఖగోళ భౌతిక ఆవిష్కరణకు ఈ సాపేక్ష సిద్ధాంత నిర్ధారణ ఉపకరిస్తుంది అన్నది కూడా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తాజాగా ఓ జాతీయ పత్రికలోవచ్చిన కథనాలను బట్టి చూస్తే ఈ విశ్వగతంలోకి ప్రయాణం చేయడానికి గురుత్వాకర్షణ తరంగాలు దోహదం చేయవచ్చని స్పష్టమవుతోంది. ఈ విశ్వరహస్యాలను ఛేదించడంతోపాటు దాని మూలాలపైన లోతైన అవగాహనను పెంపొందించేకునే దిశగా మనిషి చేస్తున్న కృషికి ఈ ఆవిష్కరణ నిదర్శనం. కృష్ణబిలాను సహా రోదసీ మిస్టరీలు అంతుబట్టకుండానే ఉన్నాయి. గురుత్వాకర్షక తరంగాల నిర్ధారణ టైమ్‌మిషన్ ఆవిర్భావానికి దారితీస్తే విశ్వతొలిదశ లోతుల్లోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది!