రాష్ట్రీయం

ట్రాఫిక్ నిబంధనలు అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రోడ్డుపై భద్రతపై మార్గదర్శకాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అనివార్యమంటూ రాష్ట్రాలకు కమిటీ సూచించింది. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, క్రాసింగ్‌ల వద్ద రెడ్‌లైన్ జంపింగ్, వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం, ఓవర్ లోడ్ వంటి నిబంధనల ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేయాలని కమిటీ పేర్కొన్నట్టు ట్రాన్స్‌పోర్టు కమిషనర్, నగర అదనపు పోలీసు కమిషనర్ వెల్లడించారు. ఈ నెలాఖరు నుంచి వాహనదారులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వారు సూచించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాల యజమానులు వాహనాలు ఇవ్వొద్దని ఈ నిబంధనలు పాటించని వారిపై మోటారు వాహన చట్టం 181, 180 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. వాహనాల కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలని, సర్ట్ఫికెట్లు లేని వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి మాసాంతం నుంచి కచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు.