రాష్ట్రీయం

టాస్క్ఫోర్స్ దళంపై ఎర్రచందనం కూలీల రాళ్లదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 15: ఎర్రసంపదను కాపాడటానికి టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాక సిబ్బంది అనేక చర్యలు చేపడుతున్నా ఎర్ర కూలీలు మాత్రం శేషాచల అడవుల్లోకి భిన్న రూపాల్లో ప్రవేశిస్తూ, తారసపడ్డ పోలీసులపై రాళ్ళురువ్వే చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే సోమవారం తిరుపతి జూపార్క్ అటవీప్రాంతంలో 30 మంది ఎర్రకూలీలు కార్యదళ సిబ్బందికి తారసపడ్డారు. పోలీసులను గమనించిన కూలీలు ఒక్కసారిగా పోలీసులపై రాళ్ళు రువ్వారు. ఈసంఘటనలో ఆర్‌ఎస్‌ఐ వాసు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన కార్యదళం గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో ఎర్రకూలీలు అడవిలోకి పలాయనం చిత్తగించారు. వెంటాడిన పోలీసులకు ఇద్దరు ఎర్రకూలీలు పట్టుబడ్డారు. వారు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 24 ఎర్రదుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న డి ఐ జి కాంతారావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందమాలలు వేసుకున్న భక్తుల రూపంలో 30 మంది ఎర్రకూలీలు ముందుగా తిరుమలకు వెళ్లారని అటు తరువాత వారు శేషాచల అడవుల్లోకి ప్రవేశించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈక్రమంలో కూంబింగ్ చేస్తున్న తమ సిబ్బందికి జూపార్క్ వద్ద ఎర్ర కూలీలు తారసపడ్డారని అన్నారు. పారిపోయిన కూలీల కోసం కూంబింగ్ ముమ్మరం చేశామని ఆయన తెలిపారు.