రాష్ట్రీయం

తాత్కాలిక సచివాలయం, ఇతర భవనాల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామ సమీపంలో ప్రతిపాదిత తాత్కాలిక సచివాలయం, ఇతర ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ, ఎంవోఇఎఫ్ అండ్ సీసీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి ఈ నెల 9న అన్నిరకాల అనుమతులు లభించినట్లు సిఆర్‌డిఏ అధికారులు సోమవారం నాడిక్కడ తెలిపారు. రాజధాని అమరావతి నగర ప్రాజెక్టు అభివృద్ధి పనులకు పర్యావరణ అనుమతులు లభించటం ఇది రెండోసారన్నారు.
స్టేట్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ నిపుణులు గత నెల 23న ఒకసారి, ఈ నెల 6న మరోసారి నిర్వహించిన సమావేశాల్లో సిఆర్‌డిఏ దరఖాస్తును సమీక్షించి సుదీర్ఘ చర్చల అనంతరం తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి అనుమతుల జారీకి సిఫార్సులు చేశారన్నారు. సిఆర్‌డిఏ అదనపు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులతో కలిసి నిపుణుల బృందానికి సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న విభిన్న చర్యలను ఆయన వివరించారు. ప్రజా సౌకర్యాలతో కూడిన సముదాయాన్ని 45.129 ఎకరాల్లో ఆరు బ్లాకులుగా నిర్మించనున్నారు. దీనిలోనే సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ నిర్మాణాలుంటాయి. మొత్తం 58వేల 655 చదరపు మీటర్లు బిల్డప్ ప్రాంతం కాగా 23వేల 587 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. కార్యాలయాల బ్లాకులు సౌర పైకప్పులు కలిగి ఇంధన సామర్థ్య విధివిధానాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. దీంతోపాటు ఉద్యోగులు, సందర్శకులకు తగినంత పార్కింగ్ వసతి కల్పించనున్నారు. శబ్ద కాలుష్యం లేకుండా గ్రీన్ కవర్, నీటిశుద్ధి, నీటిని తిరిగి ఉపయోగించేందుకు ఎస్‌టిపిని ఏర్పాటు చేయనున్నారు. ఈసందర్భంగా సిఆర్‌డిఎ కమిషనర్ ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలకు సంబంధించి చట్టబద్ధమైన నియమ నిబంధనలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.