అంతర్జాతీయం

ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 3: సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫ్రిజ్‌ను కొన్న అమెరికా మహిళకు ముచ్చెమటలు పట్టాయి. సమీపంలోని ఓ గ్యారేజీలో కేవలం 30 డాలర్లకే ఈ సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్‌ను ఆనందంగా కొనేసింది. ఈ గ్యారేజ్ తన పొరుగున ఉన్న వారిదే కావడంతో చాల నమ్మకంతోనే దాన్ని కొన్నానని ఉత్తరకరోలీనాకు చెందిన మహిళ వెల్లడించిది. తీరా ఇంటికెళ్లి చూస్తే అందులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉన్నాయంటూ విస్మయకర స్వరంతో తెలిపింది. వెంటనే ఈ విషయాన్ని స్థానిక చానల్‌కు తెలిపింది. అయితే తమకు ఫ్రిజ్ అమ్మిన పొరుగునున్న వ్యక్తి వెంటనే దీన్ని తెరవద్దని ఇదో టైమ్‌క్యాప్సుల్ అని చెప్పడంతో తాను దాన్ని తెరవలేదని పేర్కొంది. ఇందులో టైమ్‌క్యాప్సుల్ ఉందికాబట్టి తన ప్రాజెక్టులో భాగంగా చర్చికి దాన్ని అందించాల్సి ఉందని, దానికి సంబంధించిన వ్యక్తులే వచ్చి దీన్ని తీసుకుంటారని కూడా అమ్మిన మహిళ తనకు చెప్పినట్టు వెల్లడించింది. అయితే ఎంతకూ ఎవరూ రాకపోవడంతో ఆ ఫ్రిజ్‌ను తానే తెరిచానని అందుంలో మానవ భాగాలు బయటపడ్డాయని తెలిపింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తనకు ఈ ఫ్రిజ్‌ను అమ్మిన వెంటనే పొరుగువ్యక్తులు ఉడాయించారని ఆమె చెప్పింది. అయితే ఇంట్లో జరిగిన మరణాన్ని ధృవీకరించకుండా ఆ శవాన్ని ఫ్రిజ్‌లో దాచారన్న సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.