తెలంగాణ

సిబిఐ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజిపై సిబిఐ విచారణ జరిపించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి కంట్రోల్ లేకుండా పోయిందని విమర్శించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, కార్పొరేట్ విద్యా రంగంపై కంట్రోల్ లేకపోవడం, యూనివర్సిటీలకు విసిలు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అన్నారు. ప్రభుత్వానికి యూనివర్సిటీల పట్ల శ్రద్ధ లేకపోవడం, అక్కడ సరైన నాయకత్వం లేకపోవడం, కొత్త రాష్ట్రంలో ఇలా జరగకుండా చూడాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేయరాదని, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంసెట్ లీకేజికి మంత్రులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాజీనామా అనేది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు. లీకేజి బాధ్యత మంత్రులదేనని అన్నారు.

రద్దు మినహా మరో మార్గం లేదు
టిఎస్ ఎమ్సెట్-2 పరీక్షాపత్రం లీక్ కావడంతో మళ్లీ ఎమ్సెట్-3 నిర్వహించాల్సిందే. ఎమ్సెట్-2 కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తే న్యాయపరమైన చిక్కులు అనేకం ఎదురవుతాయి. అందువల్ల ఎమ్సెట్-2ను రద్దు చేయడమే మంచిది. మళ్లీ పరీక్షలకు సిద్ధం కావాలంటే విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందే. అది కష్టం కూడా! ఎమ్సెట్-3 నిర్వహిస్తే మళ్లీ చదువుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అంతకు మినహా మరోమార్గం లేదు.
డాక్టర్ రాంకిషన్
అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా
కోర్టుకు వెళ్లినా లాభం లేదేమో!
తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్-2ను రద్దు చేస్తే మేము కోర్టుకు వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదేమోననిపిస్తోంది. మేం గత వారం రోజుల నుండి న్యాయం కోసం చేసిన పోరాటం వృథా అయింది. మాకు తీరని అన్యాయం జరిగింది. విధిలేని పక్షంలో మళ్లీ ఎమ్సెట్‌కు సిద్ధమవుతాం.
కీర్తిశరణ్య
ఎమ్సెట్ 17వ ర్యాంకర్
కెసిఆర్‌పైనే ఆశ..
ఎమ్సెట్-2పై కెసిఆర్ మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారేమోనన్న ఆశ నాలో ఉంది. సోమవారం ప్రభుత్వ నిర్ణయం చెబుతారని అంటున్నారు. ఎమ్సెట్-3 తప్పదని మీడియాలో వస్తోంది. ఎమ్సెట్-3 తప్పదనుకుంటే మళ్లీ మేం ప్రిపేర్ కావాల్సిందే. జాతీయ స్థాయిలో ఇప్పటికే మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఎమ్సెట్-2ను నమ్ముకుని మేం ఇతర అవకాశాలను కూడా కోల్పోయాం. ఎపి ఎమ్సెట్ జాప్యం అయితే అక్కడైనా మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం. లేకపోతే మళ్లీ టిఎస్ ఎమ్సెట్-3 ఒక్కటే దిక్కవుతుంది.
హేమసుధ
ఎమ్సెట్ 26వ ర్యాంకర్