కర్ణుడిగా చేస్తా -నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోగ్గాడే చిన్నినాయన సినిమాతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నాగార్జున, కొత్తతరహా చిత్రాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగానూ మారారు. ఇప్పటికే పలు సూపర్‌హిట్ చిత్రాలు అందించిన నాగ్, తాజాగా నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 26న సినిమా విడుదలకానున్న సందర్భంలో నాగార్జున వెల్లడించిన పలు విశేషాలు.
* సినిమా ఎలా వచ్చింది?
-సినిమా అందరికీ నచ్చేలా వచ్చినందుకు నిర్మాతగా సంతోషిస్తున్నా. పది రోజుల పని ముందుగానే పూరె్తైంది. ఇదంతా టీమ్ వర్క్. సినిమాను ప్రతి ఒక్కరూ తమదిగా భావించి చేశారు.
* చైతన్య గురించి?
- చైతన్యకు తన సినిమాల పట్ల భిన్నమైన ఆలోచన ఉంది. ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. చాలా ఓపెన్‌గా నటించాడు. ఎవరికైనా ఇలాంటి ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్, కొడుకు ఉండాలనుకునేంత మంచి పాత్రలో కనిపిస్తాడు. జగపతిబాబు, చైతన్యల మధ్య సన్నివేశాలు వైవిధ్యంగా ఉంటాయి. జీవితంలో ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకుంటారు.
* దర్శకుడి గురించి..?
-కళ్యాణకృష్ణ మంచి టెక్నీషియన్. ప్రేక్షకుల నాడి తెలిసిన వ్యక్తి. సోగ్గాడే.. సినిమా తరువాత ఈ కథకు అతనైతేనే బాగుంటుందనుకున్నా. అతనితో మూడు సినిమాల కాంట్రాక్టు కూడా ఉంది. కనుక అతనే నా ఛాయిస్ అయ్యాడు.
* దేవి సంగీతం?
- దేవి చాలాకాలంగా నా సినిమాలకు మంచి పాటలు ఇచ్చాడు దేవిశ్రీప్రసాద్. ఈ సినిమాకూ మంచి బాణీలు అందించాడు. మ్యూజిక్‌పై అతని అనుభవం ఇందులో కనిపిస్తుంది. అందుకే ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి సన్నివేశాల్లో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఏమైనా మార్పులు చేయాలా? అని అడిగాను. కష్టపడి పనిచేసే వ్యక్తి కనుక ఇన్నాళ్లూ అదే స్థానంలో కొనసాగుతున్నాడు.
* రకుల్‌ప్రీత్‌సింగ్ గురించి?
- రకుల్ కొత్తగా కన్పిస్తుంది. ఆమె నటన అందరినీ మెప్పిస్తుంది. ఆమెను చూస్తుంటే ఒక్కొక్కసారి శ్రీదేవి, టబు గుర్తుకొస్తారు. అంత బాగా నటించింది. ఆమె కెరీర్‌లో ఇదో విభిన్నమైన సినిమా.
* మీరే విడుదల చేస్తున్నారు?
- సినిమామీద నమ్మకంతోనే చేస్తున్నా. అందుకే వైజాగ్, నైజాం, కృష్ణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నాం. సినిమా బాగా వచ్చిందని తెలిస్తే అలా చేసే అవకాశం ఎందుకు వదులుకుంటాం.
* భారతంలో చేస్తారా?
-నిర్మాతలు కర్ణుడి పాత్రను చేయమని అడిగారు. వాసుదేవ నాయర్ మంచి స్క్రీన్ ప్లాన్ ఇచ్చాడు. దీని గురించి ఇప్పుడు మాట్లాడటం కంటే ఓసారి సినిమా అంతా మెటీరియలైజ్ అయ్యాక మాట్లాడటం మంచిది.
* అఖిల్ గూర్చి?
- అతని సినిమా యాక్షన్ పార్ట్ పూర్తయింది. టైటిల్స్ నాలుగైదు అనుకున్నాం. ఒకటి ఫైనలైజ్ చేయాల్సి ఉంది. మంచి తెలుగుదనమున్న టైటిలే పెడతాం.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
-రాజుగారి గది-2 పూర్తికావస్తోంది. దీని ఔట్‌పుట్ చూసి మళ్లీ పది రోజుల రీ షూట్ చేయమన్నాను. ఇంకా కొన్ని కథలు వింటున్నా.
* చైతు, సమంతల పెళ్లి?
- చైతు సినిమాల్లో ఈజప్ అయిపోయాడు. అది సమంత ఎఫెక్ట్ అనుకుంటా. అతనిలో హ్యాపీనెస్ కనిపిస్తోంది. 30 ఏళ్లు వస్తేనే మగవారు ఫామ్‌లోకి వస్తారట. ఇప్పుడు తనకు 30నిండింది. సమంతతో ‘మనం’ సినిమా నుంచి పరిచయం. అప్పుడు సార్ అనేది, ఇప్పుడు ఎలాగో ఒప్పించి మామ అని పిలిపిస్తున్నా. మామయ్య అంటే మరీ ఓల్డ్‌గా వుందని నేనే అన్నాను. వాళ్ల పెళ్లి అక్టోబర్‌లో ఉంటుంది.

-శ్రీ