అక్షరాలోచన

ఇది సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మతనం
‘కొంటే’ దొరికేది కాదు
‘కంటే’ స్వంతమయేయది
‘నలుగురు’న్న ఇంటిలో
‘ముగ్గురు’కే అన్నం ఉంటే
తనకు ఆకలి లేదనే
‘ఒక్కరే’ అమ్మనే అమృతమూర్తి
ప్రసవం ప్రాణాంతకమని తెలిసినా
మరో ప్రాణం కోసం
తన ప్రాణం లెక్కచేయని
త్యాగ‘్ధనం’ అమ్మతనం
పేగు తెంచుకుని
బయటకొచ్చిన బిడ్డను చూసి
అమ్మ పడే ఆనందం
జన్మ‘జన్మల’ రుణానుబంధం
బ్రహ్మ కూడా రాయలేని గ్రంథం
తను లేకున్నా
బిడ్డ బ్రతికితే చాలనుకునే
నిస్వార్థానికి నిలువెత్తు రూపం
ఏ గురువూ బోధించలేని
ఆత్మీయానురాగాల దీపం
పురిటినొప్పులు
భరించినా.. చెప్పుకోదు గొప్పలు
పాలతో ప్రాణవాయువు ఇచ్చే
వైద్యకత్తె
బిడ్డ పుష్టి కోసం
దిష్టి తీసే మంత్రగత్తె
అమ్మ నిఘంటువులో
అన్ని పదాలకు ఆత్మీయతే ‘అర్థం’
అమ్మకు సేవచేయని జన్మంతా ‘వ్యర్థం’
తరతరాల వారసత్వానికి ‘వారధై’ నిలుస్తుంది
సంతానాన్ని పెంచే ‘సారథై’ గెలుస్తుంది
మాతృత్వమనే వరం
సృష్టిలో ఒక్క స్ర్తి మూర్తికే
దక్కిన ‘దైవత్వం’
గౌరవించడం ‘మానవత్వం’
అందరం ఆచరించాల్సిన
నిత్య‘సత్యం’
*

-ధరణికోట శివరామ ప్రసాద్ 80191 21081