ఆటాపోటీ

టెన్నిస్‌లో ఫిక్సింగ్ చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది మొట్టమొదటి గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభమైన రోజే టెన్నిస్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయని బిబిసి, బజ్‌ఫీడ్ న్యూస్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కోవడం సంచలనం రేపింది. గత దశాబ్దకాలంలో ‘టాప్-50’ ర్యాంకింగ్స్‌లో ఉన్న 16 మంది క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. వారిలో ఎనిమిది మంది ఆస్ట్రేలియా ఓపెన్‌కు హాజరైనట్టు ప్రకటించడంతో టెన్నిస్ రంగంలో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారిలో కొంత మంది గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిళ్లు సాధించినవారు కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. బుకీలతో ముమ్మక్కయిన కొంత మంది ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా మ్యాచ్‌లను చేజార్చుకుంటున్నారన్న అంశం 2007లోనే తెరపైకి వచ్చింది. పురుషుల విభాగం టెన్నిస్‌ను పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ సమాఖ్య (ఎటిపి) ఆ విషయాన్ని టెన్నిస్ ఐక్యతా విభాగం (టిఐయు) దృష్టికి తీసుకెళ్లింది. కానీ, దోషులను గుర్తించలేదు. చర్యలు తీసుకోలేదు. రష్యా, ఇటలీ, సిసిలీ తదితర దేశాలకు చెందిన బుకీలు వివిధ మ్యాచ్‌ల ఫలితాలను ముందుగానే నిర్ధారిస్తున్నాస్తున్నారని, దీని వల్ల కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న నివేదికపై ఎవరూ స్పందించలేదు. ఫిక్సింగ్‌కు సహకరించే ఒక్కో క్రీడాకారుడికి కనీసం 50,000 డాలర్లు లభిస్తాయని, వారివారి స్థాయిని బట్టి ఈమొత్తం పెరుగుతునే ఉంటుందని నివేదిక స్పష్టం చేస్తున్నది. అయతే, ఈ వ్యవహారంపై ఎటిపి అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా టెన్నిస్‌లో అక్రమాలు పెరుగుతూ వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌లు రోజురోజుకూ
పెరుగుతున్నాయ.
ఇలావుంటే, రష్యా ఆటగాడు నికోలై డవిడెన్కో, అర్జెంటీనాకు చెందిన మార్టిన్ వాసలో ఆర్గెల్లోపై ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని బిబిసి, బజ్‌ఫీడ్ అభిప్రాయపడినట్టు అనధికార సమాచారం. వీరి పేర్లను ఎటిపి అధ్యక్షుడు క్రిస్ కెర్మొడో కూడా ప్రస్తావించడం విశేషం. కానీ, వీరిని దోషులుగా తేల్చడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఏవీ లేవని అతను అన్నాడు. కారణాలు ఏవైనప్పటికీ, టెన్నిస్‌ను కూడా ఫిక్సింగ్ మహమ్మారి కబళిస్తున్నదన్న వాస్తవం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది.