హైదరాబాద్

కువైట్ క్షమాభిక్ష ప్రకటించిన తెలంగాణవాసులను రప్పించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: కువైట్ ప్రభుత్వం క్షమాబిక్ష ప్రకటించిన తెలంగాణ వాసులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్నారై శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఉపాధి కోసం కువైట్‌కు వలస వెళ్లిన కార్మికులు కొందరు పర్మిట్, వీసా లేకుండా అక్రమంగా ఉంటున్నారు. వీరికి ఆ ప్రభుత్వం ఇటీవల క్షమాబిక్ష ప్రకటించింది. ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే వెనక్కి రప్పించేందుకు అవసరమై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఆదివారం ఈ మేరకు మంత్రి అక్కడి అధికారులతో మాట్లాడారు. ఈ విషయంలో ఇతరత్రా ఏదైనా సమస్యలు ఎదురైతే విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌తో చర్చించనున్నట్టు మంత్రి స్పష్టం చేసారు. కువైట్ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు అక్కడ అక్రమంగా ఉంటున్న వారు వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని మంత్రి సూచించారు. విమాన టిక్కెట్టుకు డబ్బులు లేకపోయినా అధికారులను కలిస్తే వారికి కావాల్సిన చార్జీలను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎంత మందికి విమాన టిక్కెట్లు అవసరమో వెంటనే వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు.