అంతర్జాతీయం

తైవాన్‌లో భూకంపం.. ఆరుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హువాలిన్, ఫిబ్రవరి 7: తైవాన్ తూర్పుతీరంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. పెద్దసంఖ్యలో పౌరులు శిథిలాలకింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయకబృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. భూకంపం సృష్టించిన విధ్వంసంలో కనీసం ఆరుగురు మరణించగా, 88మంది ఆచూకీ తెలియలేదు. 256 మంది తీవ్రంగా గాయపడ్డారు. తైవాన్‌లోని హూవాలిన్ కౌంటీలో ఎటు చూసినా శిథిలాల గుట్టలుగా మారిపోయిన భవనాల దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాలుగు బహుళ అంతస్థుల భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పాక్షికంగా దెబ్బతిన్న అపార్టుమెంటుల్లో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం రాత్రి సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు కుప్పకూలిన మార్షల్ హోటల్ శిథిలాల్లో చిక్కుకుపోయిన కార్మికుడిని, మరో ఉద్యోగిని సహాయక బృందాలు కాపాడి బంధువుల చెంతకు చేర్చాయి. భూప్రకంపనల ధాటికి రహదార్లు, విద్యుత్, మంచినీటి వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిలో సజీవంగా ఉన్నవారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తైవాన్ అధ్యక్షుడు తాయ్ ఇంగ్ విన్ పేర్కొన్నారు. భూకంప ప్రభావిత హూవాలిన్‌ను ఆమె సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యల్లో సహకరించేందుకు చైనా సిద్ధంగా ఉందని తైవాన్ వ్యవహారాలను చూసే చైనా అధికారి పేర్కొన్నారు.