మెయిన్ ఫీచర్

శిఖరాగ్రాన తెలుగు సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా స్టామినా రోజురోజుకూ పెరుగుతూనే వుంది. దశ, దిశను మార్చుకుంటూ మన చిత్రాలు వేగంగా ఎల్లలు దాటుతున్నాయ్. ముఖ్యంగా ఓవర్సీస్‌లో మన సినిమాలకున్న ఆదరణ, రాబడి చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతోంది. 2మిలియన్ డాలర్లు ఆపైన వసూలు చేసిన తెలుగు సినిమాలను పరిశీలిస్తే ఓవర్సీస్‌లో పెరిగిపోతోన్న
మన పవరేంటో ఇట్టే అర్థమవుతోంది. ‘వాహ్..తెలుగు సినిమా’ అనకుండా వుండలేం. బాహుబలి: 2 (20 మిలియన్),
బాహుబలి: 1 (6.9 మిలియన్), శ్రీమంతుడు (2.9 మిలియన్), అఆ (2.49 మిలియన్), ఖైదీ నెం.150 (2.4 మిలియన్), ఫిదా (2.06 మిలియన్), నాన్నకు ప్రేమతో..
(2.02 మిలియన్), అజ్ఞాతవాసి (2 మిలియన్). మొత్తంగా ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటుదక్కించుకున్న మన తెలుగు చిత్రాలు ఎనిమిది.

ఇన్నాళ్లు విదేశీ చిత్రాలు, హిందీ చిత్రాలు అంటూ ఇతరులు రూపొందించిన చిత్రాలను చూసి మురిసేవాళ్లం. ఇవ్వాళ.. తెలుగు చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ.. ఓవర్సీస్‌లో మన చిత్రాలకున్న స్టామినా చూసి గర్వపడుతున్నాం. ఓవర్సీస్‌లో ఇంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న మన ఎనిమిది తెలుగు
చిత్రాల్లో ఇంతకీ ఏముంది? ఓవర్సీస్‌లో ఆయా చిత్రాలు అంతటి వసూళ్లను ఎలా రాబట్టగలిగాయి?

ఎంతో అట్టహాసంగా, ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’ విడుదలైన తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరి, అక్కడ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని తెలియజేసి అందీర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన తెలుగు చిత్రాలు కేవలం ఎనిమిది మాత్రమే ఉండటం గమనార్హం. అందులో పవన్‌కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ 8వ స్థానంలో ఉండటం విశేషం. తెలుగు చిత్రాలు ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుండంతో మన తెలుగు చిత్రసీమ చరిత్ర ఉన్నత స్థాయిలోకి అడుగుపెడుతూ, మంచి పేరును తెచ్చుకుంటోంది. అంతకంతకూ వసూళ్లు రాబడుతూ ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇన్నాళ్లు విదేశీ చిత్రాలు, హిందీ చిత్రాలు అంటూ ఇతరులు రూపొందించిన చిత్రాలను చూసి మురిసేవాళ్లం. ఇవ్వాళ.. తెలుగు చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ.. ఓవర్సీస్‌లో మన చిత్రాలకున్న స్టామినా చూసి గర్వపడుతున్నాం. ఓవర్సీస్‌లో ఇంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న మన ఎనిమిది తెలుగుచిత్రాల్లో ఇంతకీ ఏముంది? ఓవర్సీస్‌లో ఆయా చిత్రాలు అంతటి వసూళ్లను ఎలా రాబట్టగలిగాయి? ఇంతటి సంచలనం కలిగించిన ఈ చిత్రాలు అక్కడ అత్యధిక థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టడంలో ఆంతర్యమేమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఆయా చిత్రాల్లోకి ఓసారి తొంగిచూడాల్సిందే... ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్ ఏంటనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వచ్చింది. కేవలం తెలుగు మార్కెట్ నుంచే రెండు వందల కోట్లకి పైగా షేర్ రావడమనేది సాధ్యమని రుజువయింది. దీంతో పెద్ద సినిమాలకి కొమ్ములొచ్చాయి. అరవై, డెబ్బయ్ కోట్ల వద్ద తచ్చాడిన మార్కెట్ అమాంతం వంద కోట్లు దాటేసింది. అయితే విడుదలయ్యే సినిమాల్లో ఎన్ని ‘బాహుబలి’లో సగమైనా చేయగలవు? ఒక వేళ అంచనాలు తలకిందులు అయితే తిరిగి వచ్చేదెంత? పెరిగిందని అనుకుంటోన్న మార్కెట్‌కి అనుగుణంగా బిజినెస్ చేస్తున్నారు. బానే వుంది. హిట్ అయితే వందకోట్లకు పైగా వసూళ్లు రావొచ్చు. కానీ ఫ్లాపయితే మాత్రం మునుపటిలానే వుంది పరిస్థితి. దీంతో గతంలో పది, ఇరవై కోట్ల నష్టం వచ్చేది. ఆ నష్టం కాస్తా ఇప్పుడు నలభై, యాభై కోట్లకి పెరిగిపోయింది. ‘బాహుబలి’లాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. వాటిని కొలమానంగా పెట్టుకుని మిగతా సినిమాలని తూచకూడదు. రెగ్యులర్ సోషల్ సినిమాలు కూడా అదే స్థాయిలో నిలకడగా వసూళ్లు సాధిస్తూ వుంటే కనుక అప్పుడు అందుకు అనుగుణంగా మార్కెట్‌ని విస్తృతం చేసుకోవాలి. సరాసరి నూట ఇరవై కోట్లు దాటించేసిన మహేష్‌బాబు ‘స్పైడర్’, పవన్‌కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రాలు బయ్యర్ల నడ్డివిరిచేశాయి. ఇక మీదైనా వాస్తవం గ్రహించి బయ్యర్లు మేలుకుంటారా? లేదా? అనేది చూడాలి. ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య తారాగణంగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి: 2 (20 మిలియన్), బాహుబలి: 1 (6.9 మిలియన్)లతో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి తెలుగు సినిమా స్టామినాను పెంచాయి. విజయేంద్రప్రసాద్ కథను సమకూర్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి తీర్చిదిద్దిన తీరు అందర్నీ కట్టిపడేసింది. వినోదాన్ని అందించే సినిమాలు తీయాలని కొందరు, సందేశాత్మక సినిమాలు తీయాలని ఇంకొందరు, గుర్తుంచుకునే సినిమాలు తీయాలని మరికొందరు..్ఫలిం మేకర్స్‌లో ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా తీరు. కానీ రాజవౌళి మాత్రం కాస్త వేరు. ప్రతి సినిమాతో తనకి తానే సవాల్ విసురుకుంటున్నట్టు, మునుపటి సినిమా కంటే ఇంకోమెట్టు పైకి ఎక్కాలన్నట్లు ఎంతో కసిగా తీస్తాడు. ఆ కసి లేకపోతే ‘మగధీర’, ‘ఈగ’ ‘బాహుబలి’లాంటివి ఊహకు కూడా రావు. ఎంచక్కా రెండు హీరో ఎలివేషన్ సీన్లు, ఒక నాలుగు మసాలా పాటలు, ఆరు పంచ్ డైలాగులు పెట్టేసుకుంటే సినిమాలు గట్టెక్కాస్తాయి. ఆరు నెలలకో సినిమా చేసుకుంటూ హ్యాపీగా కాలం గడిపేయొచ్చు. కానీ ‘ఎవరూ చేయనిది ఏదో చేయాలి, మన సినిమా గుర్తుండు పోవాలి. మనం తీసిన సినిమా గురించి జనం మాట్లాడుకోవాలి. వంద సినిమాల మధ్య మన సినిమా తలఎత్తి చూసే శిఖరంలా నిలబడిపోవాలి’ అన్నట్టు తపించాలంటే దానికి ఫ్యాషన్ కావాలి. అన్నింటికీ మంచి కలల్ని నిజం చేసుకుంటామనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వుండాలి. పట్టుమని డెబ్బయ్ కోట్ల మార్కెట్ నికరంగా లేని ఒక ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమకి చెందిన దర్శకుడి ఆలోచనలు ఎక్కడ వుంటాయి? ఎంతలో ఆగుతాయి? నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో ఒక ప్రాంతీయ భాషా చిత్రం తీయడమంటే మాటలా? అంత అవుతుందని చెప్పడానికి దర్శకుడికి ఎన్ని గుండెలు కావాలి? అంత అవౌంట్ విన్నాక నిర్మాతలు ఎక్కడికెళ్లి దాక్కోవాలి? అంత డబ్బు వెనక్కి తెచ్చేసుకోగలం అనే ధీమా లేకపోతే ఎలా దిగగలరు? పోతుందేమోననే భయం వెంటాడుతున్నప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఖర్చు పెట్టగలరు? పరిమితులకి మించిన ఆలోచనలుండాలే కానీ పరిధులు వాటంతట అవే విస్తృతం అవుతాయని ‘బాహుబలి’ నిరూపించింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రమే జాతి మొత్తం ఎదురుచూసే సినిమాగా మారింది. సాంకేతికంగా ఎంతటి ఉన్నత ప్రమాణాల కోసం పరితపించినా, రాజవౌళి చిత్రాల్లో వౌలిక కథ ఎప్పుడూ మూలాలను విడిచిపెట్టదు. భావోద్వేగాలకి, ధీరోదాత్తతకి రాజవౌళి పెద్దపీట వేస్తాడు. ‘బాహుబలి’ ఎంతటి హీరో అనేది రాజవౌళి విజువలైజేషన్‌లో చూసి తీరాల్సిందే. బాహుబలిని ఎలివేట్ చేసే ప్రతి సీన్‌కీ.. బాహుబలిని చూసి మురిసిపోయే మహిష్మతి కామన్ పబ్లిక్‌లా మనం కూడా పులకించిపోవాల్సిందే. రాజవౌళి కథకి, కథానాయకుడికి అనుగుణంగా తన ఇమాజినేషన్‌ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తుంటాడు. ఏనుగు ధనస్సు ఎక్కుపెడితే, బాహుబలి బాణం సంధించడం అనేది ఎంతమంది ఊహించగలరు? ఒక రాజు, రాణి ప్రేమించుకుంటే ఆ రొమాన్స్ ఎంత గ్రాండ్‌గా వుండాలో ‘హంసనావ’ పాటలో మబ్బుల గుర్రాల సాక్షిగా రాజవౌళి చూపించిన తీరుకి ఎవరైనా హ్యాట్సాఫ్ చేప్పి తీరతారు. హీరో ఎలివేషన్ సీన్లయితే ఒళ్లు గగుర్పొడుస్తాయి. బాహుబలి ధీరత్వాన్ని దేవసేన మొదటిసారిగా చూసే సన్నివేశం, తర్వాత అతనెవరనేది ఆమెకి తెలిసే సన్నివేశం వాహ్.. అనిపిస్తుంది. ఎమోషనల్ కాన్‌ప్లిక్ట్‌ని సృష్టించడంలో రచయిత విజయేంద్రప్రసాద్ తన అనుభవాన్ని రంగరించారు. ఉన్నత విలువలున్న పాత్రలు తమ స్వభావ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపించే సంఘటనలని, వ్యూహాలని రచించిన తీరు అమోఘం. రాజ తంత్రాలు, కుతంత్రాలు, కుయుక్తులు వగైరా అంశాలతో ఎంగేజింగ్ కాస్టూమ్ డ్రామాగా బాహుబలిని తీర్చిదిద్దిన విధానం అద్భుతం. అమరేంద్ర బాహుబలిగా మరొకరు ఊహకి కూడా రాని తీరున ప్రభాస్ ఆ పాత్ర కోసమే పుట్టినట్టున్నాడు. అనుష్కకి అరుంధతి తర్వాత అంతటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ దొరికింది. ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. తనకి తానే ఉన్నత ప్రమాణాలు సెట్ చేసుకునే రాజవౌళికి ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం మంచినీళ్ల ప్రాయం. విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఘనంగా ‘బాహుబలి: 1, బాహుబలి: 2’ బాక్సాఫీస్‌కి సరికొత్త అంకెలు చూపించడంతో పాటు తెలుగు సినిమాని శిఖరాగ్రాన నిలిపాయి.
మహేష్‌బాబు, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య తారాగణగా వచ్చిన ‘శ్రీమంతుడు’ (2.9 మిలియన్) కూడా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటుచేసుకుంది. మైత్రీ మూవీస్ మేకర్స్, మహేష్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. మనకి అన్నీ ఇచ్చిన ఊరుకి తిరిగి ఏదైనా చెయ్యడం, సొంత ఊరుని దత్తత తీసుకుని అక్కడి అవసరాలన్నీ సమకూర్చడం అనే పాయింట్‌తో చాలా డెప్త్ వుంది. మంచి డ్రామా, భావోగ్వేగాలు నిండిన క్లాసీ సినిమా అవడానికి తగ్గ కానె్సప్ట్ ఇది. ఇలాంటి పాయింట్‌కి ఒక కమర్షియల్ స్క్రీన్‌ప్లే రాయవచ్చుననే ఆలోచన వచ్చిందుకే రచయిత, దర్శకుడు కొరటాల శివని మెచ్చుకోవాలి. మహేష్‌బాబులాంటి సూపర్‌స్టార్‌తో ఇలాంటి కథ చేద్దామని అనుకోవడంలోనే చాలా సాహసమయింది. ఆ కథని కమర్షియల్ చెప్పగలననే నమ్మకం ఉండడమేకాక, అందుకు అనుగుణంగా కథనం రాసుకున్న తీరు మాత్రం అబ్బుర పరుస్తుంది. ప్రతి చిత్రానికి మహేష్ తన నటన, ఆహార్యం, వాచకంలో చూపిస్తోన్న మార్పులు అనితర సాధ్యం. సున్నితమైన కథని, మెజారిటీ ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలోనే ‘శ్రీమంతుడి’ విజయరహస్యం దాగివుంది. వాణిజ్య అంశాలతో కూడిన ఉత్తమ లక్షాణాలున్న ఇలాంటి చిత్రం 2 మిలియన్ క్లబ్‌లో చేరి సత్తాచాటింది.
నితిన్, సమంత, అనుపమాపరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అఆ’ సైతం (2.49 మిలియన్) 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. మన మూలాల్ని వెతుక్కుంటూ మళ్లీ అక్షరాలు దిద్దుకునే ప్రయత్నంలో చేసిన చిత్రమిది. నేటి తరం ప్రేక్షకులకి నచ్చే వినోదాన్ని జోడించి ఆ పాత మధురానికి కొత్త సొబగులు అద్ది ఒక చక్కని వినోదాత్మక కుటుంబ కథా చిత్రాన్ని అందించాడు దర్శకుడు. మనస్పర్థల వల్ల రెండు కుటుంబాలు విడిపోవడం, రెండిళ్లకీ చెందిన యువతీ యువకులు ప్రేమలో పడడం, అడ్డంకులని దాటుకుని ఒక్కటవడం కథ. పాత కథే అయినా కానీ రెండున్నర గంటలపాటు నడిపించుకోవడానికి తగ్గ డ్రామా పుష్కలంగా వుంది. ఈ ప్లాట్ నలభయ్యేళ్ల క్రితమే వచ్చినప్పటికీ ఇప్పటికీ వర్కవుట్ అయ్యే మేటర్ ఉందని గ్రహించడంలో త్రివిక్రమ్ తెలివి తెలుస్తుంది. తనకు తానే సెట్ చేసుకున్న బెంచ్‌మార్క్‌ని మళ్లీ మళ్లీ అందుకోవడం త్రివిక్రమ్‌కి అయినా అంతా ఈజీకాదు. ఈ సినిమాతో దానిని అందుకోలేకపోయినా కానీ మరో ఆహ్లాదకర చిత్రాన్ని అందించి తనపై ప్రేక్షకులుంచే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
చాలా కాలం విరామం తర్వాత చిరంజీవి ‘ఖైదీ నెం.150’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం (2.4 మిలియన్) కూడా ఈ క్లబ్‌లో చోటును సంపాదించుకుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. పదేళ్ల తర్వాత మళ్లీ వచ్చి, వదిలి వెళ్లిన స్థానంలోనే తిరిగి నిలబడవచ్చునని ఈ చిత్రంతో సుస్పష్టం చేశారు. ‘ఖైదీ నెం.150’ని ఒక రెగ్యులర్ సినిమాగా కంటే చిరంజీవి పునరాగమన చిత్రంగా చూసిన వాళ్లే ఎక్కువ. తమిళ ‘కత్తి’కి రీమేక్ అయిన చిత్రమిది. ఇందులో రైతుల కష్టాలు, కన్నీళ్లు మనని కదిలిస్తాయి.
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘్ఫదా’ (2.06 మిలియన్) ఈ మిలియన్‌ల క్లబ్‌లోనే వుంది. తీసింది కొన్ని చిత్రాలే అయినా ప్రేక్షకులమై తనదైన ఓ ప్రత్యేక ముద్రను వేశారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు చాలా నిజాయతీగా, మన జీవితాల్ని పోలినట్టుగా ఉంటాయి. చూశాక ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఆ అనుభూతి కొంతకాలం మనతో పాటే ప్రయాణం చేస్తుంది కూడా. కొన్ని పరాజయాల తర్వాత.. విరామం తీసుకొని శేఖర్ కమ్ముల చేసిన చిత్రం ‘్ఫదా’. శేఖర్ కమ్ముల శైలి ఫీల్ గుడ్ సినిమా ఇది. ఇందులో కొన్ని జీవితాల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. తెరపై కనిపించే సన్నివేశాలు మన ఇంట్లోనో, మన పక్కింటోనే జరుగుతున్న సంఘటనల్లా అనిపిస్తాయి. ఒక అందమైన పల్లెటూరు, అందమైన మనషుల నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ ఈ చిత్రం. తెలంగాణ యాస మరింత అందంగా వినిపిస్తుంది. వరుణ్‌తేజ్, సాయిపల్లవిల జంట సినిమా పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల్ని ‘్ఫదా’ చేసింది.
ఎన్‌టిఆర్, జగపతిబాబు, రకుల్ ప్రీత్‌సింగ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య తారాగణంగా శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం నాన్నకు ప్రేమతో.. (2.02 మిలియన్) 2 మిలియన్ క్లబ్‌లో చోటు సంపాదించుకుంది. సుకుమార్ కథలు చెప్పుకోవడానికి చాలా సింపుల్‌గానే అనిపిస్తాయి. కానీ తన మేథస్సుతో ఒక మామూలు కథకి అబ్బురపరిచే కథనం జోడిస్తాడు. తండ్రిని మోసం చేసిన వాడిపై పగతీర్చుకునే కొడుకు కథ ఇది. ‘నాన్నకు ప్రేమతో’ ప్లాట్ ఇదే. ఎన్‌టిఆర్‌ని ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా చూపించడంలో సుకుమార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కేవలం ఆహార్యంలోనే కాదు, ఎన్‌టిఆర్ నటనలో కూడా చాలా ఢిపరెన్స్ కనిపించింది.
ఎన్నో అంచనాల మధ్య పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి (2.మిలియన్) పరాజయాన్ని మూటగట్టుకున్నా, 2 మిలియన్ క్లబ్‌లో చేరి కాంబినేషన్ పవర్‌ని మరోసారి చూపించింది. పవన్‌కళ్యాణ్, కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. కొన్ని కాంబినేషన్లకు పరిచయాలు అక్కర్లేదు. ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. అలాంటి వాళ్లలో పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటారు. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే అంచనాలను అందుకోవడం కష్టం. ఈ విషయాన్ని వాళ్ల గత చిత్రాలు ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ నిరూపించాయి. తాజాగా ‘అజ్ఞాతవాసి’తో మరోసారి తమ సత్తా చాటే ప్రయత్నం చేసినా ప్రయత్నం లేకపోయింది. అయితే ఓవర్సీస్‌లో 2మిలియన్ క్లబ్‌లో చేరడం అంటే మాటలు కాదు. ఈ క్రేజీ కాంబినేషన్‌కున్న పవర్ అలాంటి మరి.
ఇలా మన ఎనిమిది తెలుగు చిత్రాలు ఓవర్సీస్‌లో 2 మిలియన్ క్లబ్‌లో చేరి తెలుగు సినిమాను శిఖరాగ్రానికి చేర్చాయి. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు మంచి కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తాయని, ఓవర్సీస్‌లో మరిన్ని సినిమాలు 2 మిలియన్ క్లబ్‌లో చేరి అందరి మనసుల్ని కొల్లగొడుతాయని ఆశిద్దాం.

ఎం.డి అబ్దుల్