తెలంగాణ

రాముడా.. రామనారాయణుడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం విచిత్రమైన రగడ జరిగింది. గుంటూరు జిల్లా తాళ్లాయపాలేనికి చెందిన శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, ఆయన శిష్య బృందం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి ఆందోళన రూపంలో భీష్మించుకు కూర్చోవడం సంచలం రేపింది. దీంతో 30 నిమిషాలపాటు స్వామివార్ల దర్శనాలు నిలిచిపోయాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం వేగవంతం కావాలని కోరుతూ భద్రాచలంలో శివస్వామి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ జపయజ్ఞం నిర్వహించారు. అనంతరం దర్శనంకోసం ఆయనతో పాటు 150 మంది శిష్యులు ఆలయంలోకి ప్రవేశించారు. శివ రామయ్యను దర్శించుకుంటూనే.. భద్రాద్రిలో కొలువైనది శ్రీరాముడా లేక రామనారాయణుడా అనే విషయం తేల్చాలని భీష్మించుకూర్చున్నారు. ఆయనతోపాటు శిష్యులు కూడా కూర్చొని ఆందోళన చేపట్టడంతో అర్చకులు, ఆలయ అధికారులు నిర్ఘాంతపోయారు. పీఠాధిపతికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. భద్రాచలం సీఐ సత్యనారాయణరెడ్డి శివస్వామితో మాట్లాడారు. ఏమైనా సందేహాలు ఉంటే అర్చకులతో మాట్లాడాలని, గర్భగుడిలో ఆందోళన చేయడం తగదని వారించడంతో శివస్వామి, శిష్యులు బయటకు వచ్చారు. అనంతరం శివస్వామి అర్చకులతో వాదనకు దిగారు. శ్రీరాముడిని ‘రామనారాయణుడు’ అని ఏ ప్రమాణం ప్రకారం సంబోధిస్తున్నారని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో కూడా అర్చకులు ఇష్టానుసారం రాముడి పేరును వివిధ రూపాల్లో ఉచ్చరిస్తూ తప్పిదం చేశారని, ఆ పద్ధతిని ఈ ఏడాది కల్యాణోత్సవంలోనైనా మార్చుకోవాలన్నారు.
వైదిక కమిటీ ఆగ్రహం
శివస్వామి తీరుపై భద్రాచలం వైదిక కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సందేహం ఉన్నా ప్రశాంతంగా కూర్చొని చర్చించాలని, గర్భగుడిలో వివాదం రేపడంద్వారా భక్తులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కుట్రపూరితంగా రామనారాయణ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని, దీనిపై ఎవరొచ్చి వివరణ అడిగినా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.

chitram...
భద్రాద్రిలోని రామాలయంలో అర్చకులతో వాదనకు దిగిన శివస్వామి