క్రైమ్/లీగల్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు... త్వరలో నాలుగో చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలుగు సినీ రంగం (టాలీవుడ్)తో పాటు రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈ కేసులను విచారిస్తున్న ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతోంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిచ్చిన సమాచారం మేరకు దర్యాప్తులో తెలుగు చిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖుల పేర్లు వెల్లడి కావడంతో వారిని సిట్ విచారించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ కేసులకు సంబంధించి నాలుగో చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం. సినీ రంగానికి చెందిన 12 మంది డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిలో ఓ డైరక్టర్, ఇద్దరు సినీ నటులపై నాలుగో చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలే కీలకం కావడంతో సిట్ ఆ నివేదికలు రాగానే పకడ్బందీగా చార్జిషీట్‌లు దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసును ఒత్తిళ్ల మేరకు నీరు గార్చారని, కేసులో పురోగతి లేదంటూ అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ధోరణిలో ముందుకెళుతోంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ అకున్‌సభర్వాల్ మాత్రం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము ఈ కేసును సవాల్‌గా తీసుకునే ముందుకెళుతున్నామని అన్నారు. మిగిలిన కేసుల మాదిరిగా ఈ కేసులను విచారించి చార్జిషీట్లు త్వరగా దాఖలు చేయలేమని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు ఈ కేసుకు అతిముఖ్యమైన సాక్ష్యమని, వాటి ఆధారంగా తాము ఆరోపణలను ప్రస్తావించాల్సి ఉంటుందని తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలు కొన్ని స్థానికంగా చేయగలిగితే మరికొన్ని ఇతర నగరాల్లో చేయించడం, మరికొన్నింటికి అవసరమైన పరికరాలు వంటివి విదేశాల నుంచి తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. కొంచెం నెమ్మదిగా పని చేయాల్సిన కేసులు తప్ప హడావుడిగా చేసేది కాదని వివరణ ఇచ్చారు. కాగా ఇప్పటికి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన సిట్, మిగిలిన చార్జిషీట్లను కూడా దాఖలు చేసేందుకు సన్నద్ధం కావడంతో విచారణ ఎదుర్కొన్న సినీ రంగ ప్రముఖులు, నటులు వణికిపోతున్నారు. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించిన సిట్ నాలుగో చార్జిషీట్‌లో ఓ దర్శకుడు, ఇద్దరు హీరోల పేర్లతో దాఖలు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. వీరిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నదీ, తీసుకోనిదీ ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిన తర్వాత చర్యలు ఉంటాయి. ఒక వేళ పాజిటివ్ రిపోర్టు వచ్చి, ఆ నివేదిక తీవ్రతను బట్టి చార్జిషీట్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఆరోపణలు రుజువు కాకపోతే వారిని మినహాయించే అవకాశం కూడా ఉంది. దీంతో మరికొన్ని రోజుల్లో మళ్లీ సిట్ టాలీవుడ్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.