తెలంగాణ

ఇదీ అభివృద్ధి ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విస్తృత స్థాయి అభివృద్ధి, ప్రగతి ప్రణాళికను ఆవిష్కరించారు. నిర్దుష్ట రీతిలో లక్ష్యాలను నిర్దేశించుకుని వాటని వంద రోజుల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికాయుత అజెండాను ప్రకటించారు. ఇందులో భాగంగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో 30 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులిస్తామని, వంద రోజుల్లోనే అన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఉపాధి, పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు వంద రోజుల్లో సాధించ తలపెట్టిన ఎన్నో కార్యక్రమాలను గురువారం నగరంలో విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మున్సిపాలిటీల్లో వంద రోజుల్లో చేపట్టగలిగే మార్పులు, అభివృద్ధిపై అధికారులతో చర్చించి దాని ప్రాతిపదికగానే ఈ ప్రణాళిక ప్రకటించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు తాము దృష్టి పెట్టిన ఇతర కార్యక్రమాల వివరాలను కెటిఆర్ మీడియాకు వివరించారు. జిహెచ్‌ఎమ్‌సికి సంబంధించి అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో 569 బిటి రోడ్ పనులు పూర్తి చేయాలని 30 కోట్లతో అన్ని నాలాల పూడిక తీయాలని నిర్ణయించామన్నారు. అలాగే మూడు కోట్లతో 50 బస్‌బేల అభివృద్ధి చేస్తామని, ఐదుకోట్ల రూపాయల వ్యయంతో సౌకర్యాలతో 100 పబ్లిక్ టాయిలెట్ల నిర్మిస్తామని తెలిపారు. 26 కోట్ల వ్యయంతో 40 మోడల్ మార్కెట్ల నిర్మాణంతో పాటు 14 లక్షల చెత్తబుట్టల పంపిణీ, నాలుగు ఆధునిక కబేళాల నిర్మాణం. లై ఔట్ ప్లాన్ ఆన్‌లైన్‌లో మంజూరు చేస్తామన్నారు. జిహెచ్‌ఎంసి సేవలపై ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్ రూపకల్పన చేస్తామని, ప్రత్యేకంగా ఫిర్యాదుల కోసం పోర్టల్‌నూ అందుబాటులోకి తెస్తామన్నారు. యూత్ క్లబ్‌లతో కలిసి 150 జిమ్‌ల స్థాపిస్తామని, 329 స్పోర్ట్స్ క్లబ్స్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. 4352 స్వయం సహాయ గ్రూపులకు బ్యాంకుల లింకేజీతో వంద కోట్ల రుణాలు అందిస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం 60వేల దరఖాస్తులు అందగా వంద రోజుల్లో వీటిలో 10 దరఖాస్తులను పరిష్కరిస్తారు.
మంచినీటి కనెక్షన్ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటికి మోక్షం ఈ వంద రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. 1000 రేయిన్ వాటర్ హార్వేస్టింగ్ స్టక్చర్స్ నిర్మాణం. శాస్ర్తీపురం, గోల్డెన్ హైట్స్, బుద్వేల్, సులేమాన్ నగర్, మార్కాస్ , కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్తగా నీటి సరఫరా కనెక్షన్లు ఇస్తారు.
హుస్సేన్ సాగర్‌కు ప్రధాన సమస్యగా మారిన కాలుష్య నీటిని రాకుండా వంద రోజుల్లో నిరోధించడానికి అవసరం అయిన చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీలో డిపిఎంఎస్‌ను ప్రారంభిస్తారు. లే ఔట్‌కు అనుమతి, భూ మార్పిడి, భవన నిర్మాణం వంటి అనుమతులు దీని ద్వారా ఇస్తారు. 2007-2008లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తారు. టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.
ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ కోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రాంతంలో సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు.

మున్సిపాలిటీ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన
నగర పంచాయితీల్లో 50 స్లమ్ లేవల్ ఫెడరేషన్స్ ఏర్పాటు చేస్తారు. వరంగల్‌లో 3, నిజామాబాద్‌లో రెండు ఉపాధి కేంద్రాలను ప్రారంభిస్తారు. లక్ష మంది జనాభా ఉన్న పట్టణాల్లో మూడు వేల మంది యువతకు ప్లెస్‌మెంట్ ఇప్పిస్తారు.
అచ్చంపేట, కోరుట్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, సదాశివపేట, మణుగూరు, వేములవాడ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జగిత్యాల, సత్తుపల్లి, కల్వకుర్తి, మధిర, హుజురాబాద్ మొత్తం 15 మున్సిపాలిటీలను వంద రోజుల్లో బహిరంగ మూత్ర విసర్జనకు అవకాశం లేకుండా అభివృద్ధి చేస్తారు.
23 నగర పంచాయితీల్లో లెడ్ బల్బ్‌లు
రాష్ట్రంలోని 23 నగర పంచాయితీల్లో బిపిఎల్ కుటుంబాలకు లెడ్ బల్బులను వంద రోజుల్లో అందజేస్తారు. అచ్చంపేట, లీజ, కల్వకుర్తి, కొల్లాపూర్, జోగిపేట, గజ్వేల్, దేవరకొండ, హుజూర్‌నగర్, దుబ్బాక, బడంగిపేట, ఇబ్రహీంపట్నం, పెద్దంబర్‌పేట, మేడ్చల్, హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, వేముల వాడ, మధిర, సత్తుపల్లి, భూపాల్‌పల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయితీల్లో లెడ్ బల్బులు అందజేస్తారు.
రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ వాట్సప్ జాయింట్ యాక్షన్ గ్రూప్సు ఏర్పాటు చేస్తారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు.
వంద రోజుల తరువాత సమీక్ష
వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న ఈ పనులను తిరిగి వంద రోజుల తరువాత సమీక్షిస్తారు.

చిత్రం... మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత
గవర్నర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన కెటిఆర్