ఆంధ్రప్రదేశ్‌

ప్రేమోన్మాది ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో శనివారం దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్‌కు ప్రేమోన్మాధి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ప్రేమిస్తున్నానంటూ వెంటబడినే వ్యక్తే, ఆమె తిరస్కరణను జీర్ణించుకోలేక కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడని బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం ఏలూరు మండలం చాటపర్రులోని యాదవ నగర్‌లో పైడాల ఇందుమతి కుటుంబం నివసిస్తోంది. ఆ ప్రాంతానికి సమీపంలోనే దగ్గుమెల్లి చినబాబు అలియాస్ చిన విక్కీ కుటుంబం కూడా నివసిస్తోంది. కాగా ఇందుమతిని పాఠశాల స్థాయి నుంచి చిన విక్కీ ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఆమె ఏలూరులోని పిడిబిటి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండేది. అయితే అక్కడ కూడా చిన విక్కీ వేధింపులు కొనసాగడంతో తల్లిదండ్రులు ఆమెను చదువు మాన్పించేశారు. తరువాత తల్లిదండ్రులతోపాటు కూలి పనులకు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణ పూర్వక వాతావరణం కొనసాగుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం వీరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. బాధితురాలి బంధువులు చిన విక్కీ వర్గంపై దాడి చేయడం, ఆ తరువాత వెనువెంటనే చిన విక్కీ వర్గం బాధితురాలి బంధువులపై దాడి చేయడం జరిగింది. దీనిపై రూరల్ పోలీసు స్టేషన్‌లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. ఈ సమయంలోనే శనివారం మధ్యాహ్నం ఇందుమతి తన ఇంటిలో వంట చేస్తుండగా చిన విక్కీ, అతని సోదరుడు పెద విక్కీ దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి ఇందుమతిని బాత్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో ఇందుమతి 80శాతానికి పైగా కాలిపోయింది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చివరకు చికిత్స పొందుతూ రాత్రి సమయంలో కన్నుమూసింది. సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ బాధితురాలిని ఆసుపత్రిలో పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్ కూడా శనివారం రాత్రి ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శించారు. ఉన్నత వైద్యసేవలకు ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె మృత్యువాత పడింది. అలాగే ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, స్ర్తి శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టరు ఆర్ సూయిజ్ కూడా ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శించారు.

చిత్రం... ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలిని పరామర్శిస్తున్న నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఇందుమతి (ఫైల్‌ఫొటో)