తెలంగాణ

నేడు పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీకి ఆదివారం పోలింగ్ జరుగుతుంది. ఈ మూడింటిని కైవసం చేసుకోవడానికి తెరాస తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. వరంగల్‌లో పోటీ ఏకపక్షంగా ఉన్నా, ఖమ్మం పోటీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఖమ్మం మొదటి నుంచీ వామపక్షాలకు పట్టున్న ప్రాంతం. ఒకటిన్నర దశాబ్దాల పాటు తెదేపా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినా ఖమ్మంలో వామక్షాల పట్టు కొనసాగింది. విభజన తరువాత క్రమంగా తెదేపా పూర్తిగా బలహీనపడింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాల్లో తెరాస బలం అంతంత మాత్రమే అయినా, అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్యంగా జిల్లాలో బలం పుంజుకుంది. మారిన పరిణామాల నేపథ్యంలో ఖమ్మం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని తెరాస ధీమాగా చెబుతోంది. అయితే వరంగల్ తరహాలో పూర్తిగా ఏకపక్షంగా ఫలితాలు ఉండకపోయినా, భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని తెరాస నేతలు చెబుతున్నారు. వరంగల్‌లో ప్రధానంగా తెరాస, కాంగ్రెస్‌ల మధ్య పోటీ సాగగా, ఖమ్మంలో తెరాస, వామపక్షాలు, కాంగ్రెస్, తెదేపా పోటీ పడుతున్నాయి. వరంగల్‌లో 58 వార్డులు ఉండగా, ఖమ్మంలో 50 వార్డులు ఉన్నాయి. ఆదివారం పోలింగ్ జరుగతుంది. బుధవారం ఫలితాలు వెలువడుతాయి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు తెరాస విజయానికి మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పని చేశారు. వరంగల్‌లో విజయానికి తన్నీరు హరీశ్‌రావు ప్రయత్నించారు. మంత్రులు కడియం శ్రీహరి, కె తారక రామారావు, నాయిని నర్సింహ్మారెడ్డి, ఈటల రాజేందర్ ఈరెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రచారం నిర్వహించారు. అచ్చంపేట నగర పంచాయితీలో విజయానికి కడియం శ్రీహరి ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించారు.