తెలంగాణ

హైదరాబాద్‌కు మరో కనె్వన్షన్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల కోసం ఆధునాతన అధికారిక నివాస భవనాలు నిర్మించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్మాణాలకు స్థల ఎంపికతో పాటు డిజైన్లను ఖరారు చేయడానికి సిఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. కమిటీలో రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి, సిఎం ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సమాచార, పౌర సంబంధాలశాఖ కార్యదర్శితో పాటు రోడ్లు, భవనాలశాఖకు చెందిన ఇద్దరు ఇఎన్‌సిలు సభ్యులుగా ఉంటారన్నారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారుతోందని, జాతీయ, అంతర్జాతీయస్థాయి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌ఐసిసి తరహా మరో కనె్వన్షన్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్‌శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, ఎన్ శివశంకర్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, సమాచారశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇఎన్‌సిలు రవీందర్‌రావు, గణపతిరెడ్డిలతో సిఎం సమావేశమయ్యారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన కళాభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఉండాలని సూచించారు. కళాభారతిని కనె్వన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలని సిఎం సూచించారు.