తెలంగాణ

వృద్ధిరేటు పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గత ఏడాది 8.8 శాతం ఉన్న వృద్ధి రేటు ఈ ఏడాది 9.2కు చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం, స్థూల ఆదాయం తదితర అంశాలపై మంగళవారం ఆర్థిక గణాంకశాఖ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు నివేదిక అందజేసింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు జాతీయ ఆర్థిక వృద్ధి రేటు కంటే ఎక్కువ ఉండటం విశేషం. ప్రస్తుతం జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం మాత్రమే ఉంది. దీంతోపాటు రాష్ట్ర స్థూల ఆదాయం జాతీయ స్థూల ఆదాయం కంటే ఎక్కువగా నమోదు అయింది. గత ఏడాది స్థూల ఆదాయం రూ. 4.68 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది అది రూ.5.83 శాతంగా నమోదు కావడం మరో విశేషం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. లక్షా 43 వేలుగా నమోదు అయింది. పారిశ్రామిక, సేవ రంగాలలోనూ భారీగా పురోగతి నమోదు అయింది. సేవా రంగాల్లో 14.6 శాతం, కమ్యూనికేషన్ల రంగంలో 12.9 శాతం, రియల్ ఏస్టేట్ రంగంలో 12.5 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లలో 12.5 శాతం, రుణాలలో 9.6 శాతం, తయారీ, ఉత్పత్తి రంగంలో 9.5 శాతం వృద్ధి రేటు నమోదు అయింది. అయితే వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి రేటు మందగించింది. గత ఏడాది ఈ రంగంలో 0.4 శాతం ఉండగా, అది ఈ ఏడాది 1.9 శాతంగా నమోదు అయింది. వ్యవసాయ రంగంలో 18 శాతం ఆదాయం తగ్గినట్టు ఆర్థిక గణాంకశాఖ తన నివేదికలో పేర్కొంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంలో ఆదాయం తగ్గడానికి కారణంగా పేర్కొంది. ఒక వ్యవసాయ రంగం మినహాయిస్తే మిగిలిన రంగాల్లో రాష్ట్రం వృద్ధి ఆశాజనకంగా నమోదు కావడం విశేషం.