రాష్ట్రీయం

అటకెక్కిన ‘అన్యాక్రాంతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఇతరులకు ధారదత్తం చేసిన వేలాది ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అటకెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏర్పాటు అయిన శాసనసభ సమావేశంలోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూ కబ్జాలపై విచారణకు మూడు అసెంబ్లీ హౌస్ కమిటీలను స్పీకర్ నియమించారు. శాసనసభ నియమించే హౌస్ కమిటీలు ఆరు నెలల వ్యవధిలో తమ నివేదికలను స్పీకర్‌కు అందజేయాల్సి ఉంటుంది. కానీ ఈ కమిటీలను నియమించి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు తమ నివేదికలను ప్రభుత్వానికి అందజేయలేకపోయాయి. అలాగని గడువు తీరిన తర్వాత హౌస్ కమిటీలు నివేదికలు సమర్పించడానికి అవకాశం లేదు. ఈ కమిటీలకు ఇప్పటికే రెండు పర్యాయాలు కాలపరిమితి తీరిపోయింది. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ఆరునెలలకే హౌస్ కమిటీలకు గడువు తీరిపోయింది. అయితే తమకు ఇచ్చిన గడువులోగా విచారణను పూర్తి చేయలేకపోయామని, గడువు పొడగించాలని కమిటీలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాయి. దీంతో కమిటీ కాలపరిమితిని మరో ఆరు నెలలకు పొడగించింది. అయినప్పటికీ ఇచ్చిన రెండవ గడువును కూడా కమిటీలు సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందాయి. దీంతో మూడవసారి గడువు పెంచమని కమిటీల నుంచి విజాపనలు రాలేదు. దీంతో శాసనసభా నియమావళి ప్రకారం కాలపరిమితి తీరిన హౌస్ కమిటీలు ఇచ్చే నివేదికలకు చట్టబద్ధత ఉండదు. దీంతో హౌస్ కమిటీల నియామకం కేవలం ప్రహసనంగానే మిగిలిపోయింది.
హౌస్ కమిటీలు సకాలంతో తమ నివేదికలు ఎందుకు సమర్పించలేకపోయాయి? ఈ అంశంలో ప్రభుత్వం వౌనం వహించడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటన్న దానిపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కొలువైన టిఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనసభలో తానే స్వయంగా స్పందించి భూ కబ్జాల అంశాన్ని లేవనెత్తింది. గత పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విలువైన భూములను తమ అస్మదీయులకు కట్టబెట్టిందని, భూ సంతార్పణలకు కలిపి సుమారు 3 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు స్పీకర్ దృష్టికి పాలకపక్షమే తీసుకెళ్లింది. వీటి నిగ్గు తేల్చడానికి హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా సభలో స్వయంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుస్పీకర్‌ను కోరారు. దీంతో స్పీకర్ మదుసూధనాచారి మూడు హౌస్ కమిటీలను ఏర్పాటు చేశారు. వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నేతృత్వంలో హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై కమిటీ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ఫిలిమ్‌నగర్ హౌసింగ్ సొసైటీ, నందగిరి హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూములపై విచారణ జరపాలని కూడా హౌస్ కమిటీకి ప్రభుత్వం సూచించింది. అలాగే వక్ఫ్, దేవాదాయశాఖకు చెందిన భూముల అన్యాక్రాంతంపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి నేతృత్వంలో మరో హౌస్ కమిటీని స్పీకర్ నియమించారు. భూదాన్ భూములు, సీలింగ్ భూములు, లీజు భూములు, దళితులకు పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూములపై విచారణకు మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నేతృత్వంలో మరో కమిటీని స్పీకర్ నియమించారు. ఈ కమిటీల నియామకాన్ని నవంబర్ 15, 2104న స్పీకర్ ప్రకటించారు. కమిటీల నియామకం జరిగి గత నవంబర్ నెలకే ఏడాది పూర్తి అయింది. అప్పటికే రెండు పర్యాయాలు కమిటీకి కాలపరిమితి పూర్తి అయింది. రెండవసారి గడువు పూర్తి అయి కూడా నాలుగు మాసాలు గడచింది. కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా హౌస్ కమిటీల నుంచి నివేదికలు వస్తావేమోనని శాసనసభ సచివాలయం వేచి చూసింది. అయితే తమ విచారణ ఇంకా పూర్తి కాలేదని మళ్లీ పాత సమాధానమే వచ్చినట్టు సమాచారం.